నిర్మల ధ్యానాలు - ఓషో - 60


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 60 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మానవ చైతన్యం లోపలికి వెళ్ళే కొద్దీ ఆ అనంత వైశాల్యం చూసి దిగ్రమ చెందుతాం. మనం కేంద్రానికి చేరితే అదే అనంత విశ్వం. అదే దైవత్వానికి సంబంధించిన అనుభవం. 🍀


మనిషి బాహ్యంలో కనిపించేంత చిన్నవాడు కాడు. అనంత ఆకాశం అతన్లో వుంది. సప్త సముద్రాలు అతన్లో వున్నాయి. అవును, అతను ఒక మంచు బిందువులా కనిపిస్తాడు. కానీ అతను దారి తప్పినట్లు అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఇప్పటికీ మంచు బిందువులా కనిపించే అతనిపై సైన్సు పరిశోధనలు జరుపుతోంది.

మానవ చైతన్యం లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఆశ్చర్యపోతాం. ఆ అనంత వైశాల్యం చూసి దిగ్రమ చెందుతాం. మనం కేంద్రానికి చేరితే అదే అనంత విశ్వం. అదే దైవత్వానికి సంబంధించిన అనుభవం. ధ్యానం నిలిపి లోపల్లోపలికి వెళ్ళాలి. అది అప్పటికే అక్కడ వుంది. దాని అడ్డంకుల్ని తొలగించాలి అంతే!


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Aug 2021

No comments:

Post a Comment