మైత్రేయ మహర్షి బోధనలు - 11


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 11 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 1 🌻


అపూర్వము, ప్రత్యేకము అయిన శక్తి సామర్థ్యములు కలిగి యుండి భావము నందు తమ గురించిన ప్రత్యేకతను ధరించ కుండుట మైత్రేయ సంఘ సభ్యుని ముఖ్య లక్షణము. ఎంత శక్తి సామర్థ్యములు కలిగినను, రూపలావణ్యములు కలిగినను, సంస్కారములు కలిగినను, తన గురించి తనకు విశిష్ట భావముండుట హానికరము. ఇది అహం భావమునకు దారి తీయును. అందరిలో తానొకడను భావము, అందరి యందొకడే వసియించి యుండుట చేత అందరి యందు సమభావము కలిగి యుండుట శ్రేయస్కరము. సహజీవనముకు ఇది మొదటి మెట్టు.

మైత్రేయ సంఘమున అందరును తమదైన ప్రత్యేక సామర్ధ్యములు కలిగిన వారే. ఎవరి ప్రత్యేకత వారిది అయినను, సంఘ కార్యముల యందు వారి వారి ప్రత్యేకతలను జోడించి కృషి సలుపుదురు కాని, ప్రత్యేక గుర్తింపులకొరకై ఆరాటపడరు. విశిష్టమైన రుచి కలిగిన వివిధ భోజనపదార్థములను భోజనాలయమున చేర్చినట్లు, తత్కారణముగ విందు భోజనము రసోపేతమగునట్లుగ సంఘ సభ్యుల వివిధములైన శక్తి సామర్థ్యములను సమీకరించి మహత్తర కార్యములను చేయుదురు. ఈ ప్రాథమిక సూత్రమును కుటుంబము నందు పాటించినచో కుటుంబజీవనము ఆనందకరముగ నుండును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


29 Sep 2021

No comments:

Post a Comment