🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 78 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. 🍀
మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. కాంతిలో మరణిస్తాం. కాంతితో మనం రూపొందాం. అన్ని కాలాల మార్మికుల అంతర్ దృష్టి యిది. యిటీవలే శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. యిరవై ఏళ్ళ క్రితం వాళ్ళు మార్మికుల్ని చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళు మార్మికుల మాటల్ని మాలినవనేవాళ్ళు. మనిషి కాంతి నించీ రూపొందాడా? అది యధార్థం కాదు, రూపకార్థంతో వాడారు. అనే వాళ్ళు. రూపకంగా కాదు యథార్థంగా మాట్లాడారు. ఇప్పుడు సైంటిస్టులు మనిషి కాంతి నించీ రూపొందాడంటున్నారు. అంతే కాదు ప్రతిదీ కాంతి నించే పుట్టిందంటున్నారు. ఎలక్ట్రిసిటీ నించీ, ఎలక్ట్రాన్ల నించీ అంటున్నారు. బహుదూరం చుట్టి వచ్చి వాళ్ళు అర్థం చేసుకున్నారు.
భౌతిక మార్గం బహుదూరం. ఆత్మాశ్రయ మార్గం అతి దగ్గర. నువ్వు లోపలికి చూసుకోవాలి. అంతే. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. కళ్ళు మూసుకుని లోపలికి చూసే కళను అభ్యసించాలి. ధ్యానమంటే అదే. లోపలికి చూసే కళ. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. ఒకసారి నీ కాంతిని నువ్వు చూడగలిగితే ఆశ్చర్యపోతావు. అపుడు ప్రతి వారిలో ఆ కాంతిని చూస్తావు. అది పదార్థం కాదు, స్వచ్చమైన శక్తి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
29 Sep 2021
No comments:
Post a Comment