మైత్రేయ మహర్షి బోధనలు - 26


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 26 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 16. సమాన ధర్మము -2🌻


శ్రీకృష్ణుని సమాన ధర్మమును గుర్తింప లేక యాదవులు నష్టపడిరి. సంస్కారము పెరిగిన తమకన్న చిన్నవారిని కూడ తమతో సమానముగ ఆదరింతురు. అది వారి సంస్కార గుణము. అంతమాత్రము చేత ఆదరింప బడినవారు, ఆదరించిన వానితో సమానమని భావించుట అతని దుర్గతికి దారితీయగలదు. తండ్రి కొడుకుయందు చూపు ప్రేమ, గురువు శిష్యునియందు చూపు వాత్సల్యము వారిలోని సోదరత్వమునకు సంబంధించినదే. అటులనే దైవము యొక్క ప్రేమ, వాత్సల్యమును.

దానిని సక్రమముగ నందుకొనవలెనన్నచో వినయముతో కూడిన సోదరభావ ముండ వలెను. పిల్లలు పెద్దలను మన్నించుట, పెద్దలు పిన్నలను ఆదరించుట సమాన ధర్మము నందలి భాగములే. ఇట్టి నియతిలేని సమానధర్మము వికృతమై సంఘమును దుర్గతిపాలు చేయగలదు. సమానత్వమును, సోదరత్వమును సదవగాహన చేసుకొనుటకు కూడ విద్య, వినయము అవసరము. కేవలము చదువు చాలదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2021

No comments:

Post a Comment