మైత్రేయ మహర్షి బోధనలు - 28
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 28 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 18. మొండితనము 🌻
సాధకునికి మొండితనము పనికిరాదు. మొండితనము మూర్ఛతకు చిహ్నము. మొండివానితో స్నేహము అభివృద్ధికి ఆటంకము. మొండి గుఱ్ఱము నెక్కి ప్రయాణముచేయుట సాధ్యము కాదు కదా! పట్టు విడుపులు ఆవశ్యకములు. మొండితనము మోయలేని బరువు. మొండివానికి ప్రజ్ఞా కేంద్రములు స్తంభించి అతనిని బంధించును. విజ్ఞానము సాధకునియందు వివేకమును, విచక్షణను పెంచవలెను కాని మొండితనమును కాదు. ఒక రకముగ చూచినచో మూఢ విశ్వాసములు కూడ మొండిలక్షణము గలవి.
విశ్వాసము మంచిదే అయినను దాని యందు మూఢత్వము వ్యక్తిగత వికాసమునకు అవరోధము కాగలదు. మేమందించు బోధనాంశములను కూడ మూఢ విశ్వాసముతో, మొండి పట్టుదలతో వినియోగింప వలదు. విచక్షణ వివేకములతో కాలమును, దేశమును గమనించి తెలివిగ వినియోగించు కొనుడు. సాధన దూరప్రయాణము వంటిది. సాధన ప్రయాణము బరువు కారాదు. మా బోధనలతో నిన్ను నీవు కష్టపెట్టు కొనకుము. మిక్కిలి శరీరశ్రమ కూడ మేమంగీకరింప జాలము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment