నిర్మల ధ్యానాలు - ఓషో - 103
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 103 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. 🍀
నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. నువ్వు పురుషడనుకున్నా స్త్రీ అనుకున్నా అసలు లక్షణం దైవత్వమే. నువ్వు నల్లవాడివని, తెల్లవాడివని యిదనీ అదనీ, ధనవంతుడని పేదవాడని అనుకున్నా అవన్నీ కలలే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. అది తెలుసుకోవడమే నిజమైన సంపూర్ణత. అక్కడ విశ్వాసమన్నది ముఖ్యం కాదు. దైవరాజ్యం మనలో వుందని వందల సంవత్సరాల నించీ మత గురువులు చెబుతున్నారు. ఆ మాటలు మనకెట్లాంటి సాయం చేయడం లేదు. అది నీ అంతకు నువ్వు పొందాల్సిన అనుభవం.
విశ్వసించడం సులభం. నువ్వు దేవుడివని విశ్వసించడం ఆరంభిస్తావు. అది నేనే గొప్పవాడిననే అహంకారం, పిచ్చితనం. అది అనుభవానికి సంబంధించిన సంగతి. నువ్వు దేవుడని అహంకరించడం మొదలెపెడితే దేవుడు నీకు నీడ అవుతాడు. నువ్వు ముఖ్యుడవుతావు. అదే నువ్వు అనుభవంతో 'నేను దేవుడు' అని చెబితే అది అర్థవంతమవుతుంది. దేవుడు నిజమైన దేవుడుగా వుంటాడు. అక్కడ నీ అహముండదు. ఒక మార్మికుడు ఎప్పుడయితే నేను దేవుణ్ణి అంటాడో అదే సమయంలో 'నేను లేను' అంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని విశ్వసించమని అనడం లేదు. ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోమంటాను. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా ఈ జీవితాన్ని వదిలిపెట్టకు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
02 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment