23-DECEMBER-2021 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, గురువారం, డిసెంబర్ 2021 బృహస్పతి వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 295 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 494🌹 
4) 🌹 వివేక చూడామణి - 171 / Viveka Chudamani - 171🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -123🌹  
6) 🌹 Osho Daily Meditations - 112 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 171 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 171🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 23, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం 🍀*

యం దృష్ట్వా కంసభూపః 
స్వకృతకృతిమహో 
సంస్మరన్మంత్రివర్యాన్
కిం వా పూర్వం మయేదం కృతమితి 
వచనం దుఃఖితః ప్రత్యువాచ |
ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః 
పూరయన్సర్వకామాన్
కృష్ణో రాధాసమేతో విలసతు 
హృదయే సోఽస్మదీయే సదైవ || 2 ||

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ చవితి 18:28:34 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఆశ్లేష 26:42:33 వరకు
తదుపరి మఘ
యోగం: వైధృతి 12:10:14 వరకు
తదుపరి వషకుంభ
కరణం: బాలవ 18:24:34 వరకు
వర్జ్యం: 14:35:52 - 16:19:36
దుర్ముహూర్తం: 10:24:08 - 11:08:31 
మరియు 14:50:23 - 15:34:46
రాహు కాలం: 13:38:17 - 15:01:29
గుళిక కాలం: 09:28:40 - 10:51:52
యమ గండం: 06:42:15 - 08:05:28
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37
అమృత కాలం: 24:58:16 - 26:42:00 
మరియు 25:37:12 - 27:19:04
సూర్యోదయం: 06:42:15
సూర్యాస్తమయం: 17:47:54
వైదిక సూర్యోదయం: 06:46:10
వైదిక సూర్యాస్తమయం: 17:44:03
చంద్రోదయం: 21:23:56
చంద్రాస్తమయం: 09:53:39
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
అమృత యోగం - కార్య సిధ్ది 26:42:33 
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -295 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-1
 
*🍀 18-1. పరతత్వము - సమస్త ప్రాణికోటి పరతత్త్వము నుండియే క్రమముగ వెలువడినవి కావున, మరల పరతత్త్యమే చేరవలెను. త్రిమూర్తుల కైనను గతి పరమాత్రమే. ఈ బ్రహ్మాండ సృష్టిని భరించునది పరతత్త్వము. జీవులన్నియు వారు వసించు గోళములపై ఆధారపడును. గోళము లన్నియు సూర్యునిపై ఆధారపడి యుండును. సూర్యుడు సవితృమూర్తి పై ఆధారపడి యున్నారు. సవితృమూర్తి ఆదిత్యులపై ఆధారపడి యున్నారు. ఆదిత్యులు తమకు మూలమైన అదితిపై ఆధారపడి యున్నారు. అదితి పరతత్త్వము పై ఆధారపడి యుండును. సమస్త జగత్తునకు ఆధారమైన తత్త్వము తానే.🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : నిజమునకు సమస్తమునకు మూలమైన తత్త్వము పరతత్త్వము కనుక పై తెలిపిన వన్నియు సహజముగ ఆ తత్త్వ లక్షణములే.*

*గతి : సమస్త ప్రాణికోటి పరతత్త్వము నుండియే క్రమముగ వెలువడినవి కావున, మరల పరతత్త్యమే చేరవలెను. పుట్టినచోటికే చేరవలెను. కనుక గతి అందరికిని ఒక్కటే. త్రిమూర్తుల కైనను గతి పరమాత్రమే.*

*భర్త : దేని నుండి ప్రాణికోటి పుట్టినదో దానిమీదే ఆధారపడి ప్రాణికోటి యుండును. నిజమునకు ఈ బ్రహ్మాండ సృష్టిని భరించునది పరతత్త్వము. జీవులన్నియు వారు వసించు గోళములపై ఆధారపడును. గోళము లన్నియు సూర్యునిపై ఆధారపడి యుండును. సూర్యుడు సవితృమూర్తి పై ఆధారపడి యున్నారు. సవితృమూర్తి ఆదిత్యులపై ఆధారపడి యున్నారు. ఆదిత్యులు తమకు మూలమైన అదితిపై ఆధారపడి యున్నారు. అదితి పరతత్త్వము పై ఆధారపడి యుండును. సమస్త జగత్తునకు ఆధారమైన తత్త్వము తానే.*

*మానవులు మనస్సుపై ఆధారపడి జీవింతురు. మనసునకు శ్వాస ఆధారము. శ్వాసకు స్పందన మాధారము. స్పందనమునకు సూక్ష్మ స్పందన మాధారము. సూక్ష్మ స్పందనమునకు మనలోని చోటు ఆధారము. మనలో చోటుగ యున్న ఈశ్వరుడు మన కాధారము. ఆ ఈశ్వరుడే సృష్టి యందు సమస్తమునకు ఆధారము. పరతత్త్యమే ఈశ్వరుడగు చున్నాడు. సమస్తమును భరించు వాడగు చున్నాడు. అతడే భర్త. అతడే గతి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 493 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 39

*🌻. శివుని యాత్ర - 3 🌻*

ఓ మునీ! ఆ సమయములో అచటకు విచ్చేసిన విష్ణువు మొదలగు దేవతలు అందరు శంభుని వివాహయాత్రను సంపన్నము చేయుటకై అచటనే నివసించి యుండిరి (34). అపుడు శివునిచే ఆజ్ఞాపించబడిన వారందరు శివకార్యము నంతనూ స్వీయకార్యముగా భావించి శివుని సేవించిరి (35).

కైలాసమునందు సప్తమాతృకలు శివునికి చక్కని యథోచితమైన అలంకార విధిని ఆనందముతో చేసిరి (36). ఓ మహర్షీ! పరమేశ్వరుడగు ఆ శివప్రభుని ఇచ్ఛచే ఆయన యొక్క సహజవేషము అలంకార విధిగా మారిపోయెను (37). చంద్రుడు కిరీటముగా రూపు దిద్దుకొనెను. సుందరమగు మూడవ కన్ను శుభతిలకముగా మారిపోయెను (38). ఓ మునీ! రెండు సర్పములు అనేక రత్నములతో గూడిన కర్ణకుండలములుగా రూపు దాల్చెను (39). 

ఇతరావయవముల యందుండే సర్పములు ఆయా అంగములకు మిక్కిలి రమ్యములు, అనేక రత్నములు పొదగబడినవి అగు ఆభరణములుగా రూపు దిద్దుకొనెను (40). విభూతి గంధాదులతో గూడిన అంగవిలేపనమాయెను. గజచర్మము దివ్యము, సుందరము అగు పట్టు వస్త్రమాయెను (41). 

ఆయన ఇట్టి వర్ణింప శక్యము గాని సుందర రూపమును పొందెను. ఈశ్వరుడే స్వయముగా ఐశ్వర్యమును పొందెను (42). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగులు, పతంగములు, అప్సరసలు, మహర్షులు అందరు మహోత్సాహముతో శివుని సన్నిధికి వచ్చి, ఆనంద భరితులై ఆశ్చర్యముతో గూడిన వారై ఇట్లనిరి (43).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 171 / Viveka Chudamani - 171 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -18 🍀*

*557. యోగి తాను ఎపుడూ సత్యములోనే జీవిస్తుంటాడు. అదే రెండవది ఏదీలేని శాశ్వతమైన బ్రహ్మము. అతనికి బాహ్యమైన ప్రదేశము, సమయము మొదలగునవి ఈ శరీరము యొక్క చర్మము, మాంసము, కల్మషములను పట్టించుకోడు. శరీరముతో తన పని పూర్తి అయినది.* 

*558. శరీరమును వదులుట అనేది విముక్తి కాదు. ఈ బాహ్యమైన శారీరక సంబంధాలకు యోగి అతీతుడై ఈ శరీరమును నీరు లేని పాత్ర వలె భావించి, అతడు తన హృదయ సంబంధమైన ముడులను నాశనం చేసి అవి మాయలో భాగముగా తెలుసుకున్నాడు.*

*559. ఒక ఆకు నీటి ప్రవాహములో పడినపుడు అది నదిలో పయనించినను లేక శివుని పాదము పై పడినను, లేక రోడ్డు మధ్యలో పడినను దాని ప్రభావము ఆ చెట్టుపై పడదు కదా! అలానే యోగి తన శరీరమును గూర్చి భావించును.*

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 171 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -18 🌻*

*557. The sage who always lives in the Reality – Brahman – as Infinite Bliss, the One without a second, does not depend upon the customary considerations of place, time, etc., for giving up this mass of skin, flesh and filth.*

*558. For the giving up of the body is not Liberation, nor that of the staff and the water bowl; but Liberation consists in the destruction of the heart’s knot which is Nescience.*

*559. If a leaf falls in a small stream, or a river, or a place consecrated by Shiva, or in a crossing of roads, of what good or evil effect is that to the tree ?*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 171 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -18 🌻*

*557. The sage who always lives in the Reality – Brahman – as Infinite Bliss, the One without a second, does not depend upon the customary considerations of place, time, etc., for giving up this mass of skin, flesh and filth.*

*558. For the giving up of the body is not Liberation, nor that of the staff and the water bowl; but Liberation consists in the destruction of the heart’s knot which is Nescience.*

*559. If a leaf falls in a small stream, or a river, or a place consecrated by Shiva, or in a crossing of roads, of what good or evil effect is that to the tree ?*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 



*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 8 🌻* 

*తన ఆవశ్యకములకై ఇతరులపై ఎట్లును ఆధారపడక తప్పదు. అది తప్పనిసరిగా గాక, తోటి వారి యెడల తమ వృత్తికర్మను నిండయిన ప్రేమతో నిర్వర్తించినచో తన అవసరములవియే తీరుటయే గాక, అతిలోకమయిన ఆనందము నిలుచును. ప్రేమ విస్తారమగు కొలది, ఆనందము అఖండమగును. ఆ రుచి యందు, దారాపుత్రాదుల యెడ ప్రత్యేక మమకారము తెలియకుండును.*

*తనను ఎంత ప్రేమగా తాను ఆదరించునో, అట్టి ప్రేమ ఒరుల యెడ చూపి వర్తించుటే ధర్మము. ధర్మాచరణలో నిలిచే ఆనందమే మోక్షము. అనుషంగికముగ లభించు నట్టివే అర్థకామములు. మోక్షము ఎప్పుడో కలిగే స్థితి కాదు. లోకములోని జీవులతో తనకు తాదాత్మ్యము ఏర్పడి, తనను తాను మరచేంతగా ఎదలో ప్రేమ నిండుతుందో, ఆ క్షణమే పూర్వకర్మల అలవాటుల వలన ఏర్పడిన కామ క్రోధాదులు, సుఖదుఃఖాది బంధములు తొలగును. తేలినదేమంటే ప్రేమయే మోక్షము.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 112 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 112. KNOWLEDGE 🍀*

*🕉 The most important thing to remember is that knowledge is not wisdom, and it cannot be; not only that, but it is anti wisdom, it is the barrier that prevents wisdom from arising. 🕉*
 
*Knowledge is the false coin, the pretender. It pretends to know. It knows nothing, but it can befool people-it is befooling millions of people-and it is so subtle, that unless one is really intelligent one never becomes aware of this fact. And it is so deep-rooted, because from our childhoods we have been conditioned in it. To know means to accumulate, to collect information, to collect data. It does not change you-you remain the same; just your collection of information becomes bigger and bigger.*

*Wisdom transforms you. It is really information, not just "information"--it forms your inner being in a new way. It is transformation. It creates a new quality of seeing, knowing, being. So it is possible for a person to be not at all informed and yet be wise. It is also possible for a person to be very much informed and still be very unwise. In fact, that's what has happened in the world: People have become more educated, more literate. Universal education is available, so everybody has become knowledgeable, and wisdom has been lost. Knowledge has become so easily available from paperbacks--who bothers about wisdom? Wisdom takes time, energy, devotion, dedication.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 171 / Sri Lalita Sahasranamavali - Meaning - 171 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 171. దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా ।
కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ ॥ 171 ॥ 🍀*

🍀 920. దక్షిణా : 
దాక్షిణ్యము కలిగినది

🍀 921. దక్షిణారాధ్యా : 
దక్షిణాచారముచే పొజింపబదుచున్నది

🍀 922. దరస్మేరముఖాంబుజా : 
చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది

🍀 923. కౌళినీ : 
కౌళమార్గమున ఉపాసించబదుచున్నది

🍀 924. కేవలా : 
సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది

🍀 925. అనర్ఘ్య కైవల్యపదదాయినీ :
 అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 171 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 171. Dakshina dakshinaradhya darasmera mukhanbuja*
*Kaolini kevala narghya kaivalyapadadaeini ॥ 171 ॥ 🌻*

🌻 920 ) Dakshina - She who is worshipped by the learned 

🌻 921) Daksinaradhya -   
She who is worshipped by the ignorant

🌻 922 ) Dharasmera mukhambuja -   
She who has a smiling face like the lotus in full bloom

🌻 923 ) Kaulini - She who is worshiped of the koula way

🌻 924 ) kevala -   
She who is mixture of the koula and kevala methods

🌻 925 ) Anargya kaivalya pada dhayini -   
She who gives the immeasurable heavenly stature

Continues...
🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  

https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment