నిర్మల ధ్యానాలు - ఓషో - 128
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 128 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం. తప్పులు ఆరోపించే వాళ్ళు, ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. నువ్వు నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. 🍀
ప్రపంచంలో రెండు రకాల మనుషులున్నారు. తప్పులు ఆరోపించేవాళ్ళు, అభినందించేవాళ్ళు. తప్పులు వెతికే వాళ్ళు ఎప్పుడూ బాధల్లోనే వుంటారు. వాళ్ళ హృదయాలు ముడుచుకునే వుంటాయి. వికసించవు. పూలుగా మారవు. వాళ్ళు ఎప్పుడూ వ్యతతిరేక దృష్టితోనే వుంటారు. విషయాలకు సంబంధించిన చీకటి కోణాల్ని మాత్రమే చూస్తారు. కాంతి కోణాల్ని చూడరు. ముళ్ళు లెక్కపెడతారు. పూలని చూసి పులకరించరు. నువ్వు పూల సౌందర్యాన్ని ప్రశంసించినపుడు, చీకటి నిశ్శబ్దాన్ని అభినందించినపుడు, సముద్రం కేసి ప్రవహించే నదీగమనాన్ని చూసి పరవశించినపుడు ఏదో నీలో విచ్చుకుంటుంది. నువ్వు ఎదుగుతావు.
నువ్వెంతో కాలం ముడుచుకుని వుండవు. అభినందన అన్నది నీకూ వునికికి మధ్య వంతెనలా మారుతుంది. నువ్వు మరింత మరింత సున్నితంగా మారుతావు. మరింత కవితాత్మకంగా, సౌందర్యభరితంగా మారుతావు. నీ చుట్టూ వున్న సౌందర్యం నీ పట్ల స్పందిస్తావు. అంతం లేని మార్మిక మాధుర్యం పట్ల అవగాహన కలుగుతుంది. మనం ఈ రహస్యంలో రాగాలం, భాగాలం, ఆ అనుభూతిని అందుకుంటావు. అభినందన అన్నది ప్రార్థన. పరవశమన్నది ప్రార్థన నించి వచ్చిన పరిమళం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
27 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment