నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-1 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు. 🍀
జీవితానికి ఏదయినా అదనంగా మన వంతు అందించందే ఎవరూ ఆనందంగా వుండలేరు. చాలా మంది ఆనందం కోసం అన్వేషిస్తారు. విఫలం చెందుతారు. కారణం వాళ్ళలో సృజన వుండదు. వాళ్ళు దేన్నీ సృష్టించలేరు. ప్రపంచంలో ఒకే ఒక్క ఆనందముంది. అది దేన్నో ఒకదాన్ని సృష్టించడం. అది కవిత కావచ్చు. పాట కావచ్చు. చిన్ని రాగం కావచ్చు ఎదయినా కావచ్చు. ఏదో ఒకటి సృజించనిదే నీకు సంపూర్ణత సమకూరదు. ఏదో ఒకటి సృజిస్తేనే నువ్వు దేవుడిలో భాగస్వామ్యం వహిస్తావు.
దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఏదో ఒక చిన్న పనిని, నీకు చేతనయినంత మార్గంలో నిర్వహిస్తే నువ్వు దేవుడిలో భాగమవుతావు. అట్లా చెయ్యడం వల్లనే నీకూ దేవుడికి సంబంధమేర్పడుతుంది. ఎట్లాంటి ప్రార్థనలు, కర్మకాండలు, పూజలు పునస్కారాలు దానికి ఉపయోగపడవు. నిజమైన ప్రార్థన సృజనాత్మకమైంది. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుంటే నువ్వు ఏం సృష్టిస్తావు? నువ్వు ఏ దిక్కుకు వెళ్లాలో తెలుసుకోకుంటే ఏం సృష్టిస్తావు.? ధ్యానం చేసే పని నీ శక్తి సామర్థ్యాల పట్ల నీకు స్పృహ కలిగించడం. అది కేవలం కాంతిని నీ లోపలికి పంపుతుంది. నీ అస్తిత్వం పై కాంతిని ప్రసరిస్తుంది. దాని వల్ల నువ్వు సందేశాన్ని చదవగలుగుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
29 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment