మైత్రేయ మహర్షి బోధనలు - 65


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 65 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 51. ఉత్సాహము 🌻


నిరాశ, నిస్పృహ అభివృద్ధికి చేటని తెలియుము. అట్టివానికి సందేహము మిత్రుడుగ నుండును. సందేహము నిర్మాణాత్మకపు భావములను, చేతలను నశింపజేయును. పై మూడు అవగుణముల కారణముగ మానవునకు భయమేర్పడును. భయము వలన జీవితపు సుఖము కోల్పోవుట జరుగును. నిరాశ, నిస్పృహ, సందేహము, భయము అను అవగుణములకు కారణమేమని ప్రశ్నించుకొనుము. ఆ కారణములను పరిశీలించుము.

పరిశీలనము నిష్పాక్షికముగ చేయుటకు ప్రయత్నించుము. అపుడా కారణము లన్నియు భ్రాంతి రూపములుగ గోచరింపగలవు. భయపడుటకు నిజమైన కారణము లేదని తెలియును. మరల ప్రయత్నము అభివృద్ధికై కొనసాగు ఉత్సాహము కలుగును. ఆ ఉత్సాహమే శుభంకరమైన నాంది. ఉత్సాహమే బలము. ఉత్సాహవంతునికి ధైర్యమేర్పడును. అట్టి ధైర్యముతో కష్టముల నెదుర్కొని కార్యవంతులై సిద్ధిని పొందెదరు. వృద్ధియే మార్గమున పురోగమనము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2022

No comments:

Post a Comment