వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176


🌹. వివేక చూడామణి - 176 / Viveka Chudamani - 176 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 33. బంధనాలు -2 🍀

571. బంధనాలు మరియు విముక్తి అనేవి బుద్ది యొక్క చర్యలే. అమాయకులైన ప్రజలు సత్యానికి వ్యతిరేకముగా బ్రహ్మముపై ఒక మాయ పొరను భావించారు. సూర్యునికి మేఘాలు అడ్డుపడునట్లు, మాయ బ్రహ్మానికి అడ్డుగా ఉన్నది అనగా చైతన్యవంతమైన ఈ బ్రహ్మము ఏకమైనది రెండవది ఏదీలేనిది.

572. బంధనములు ఉన్నవనే భావన అలానే ఆ బంధనాలు లేవనే భావన, సత్యమైన ఆత్మతో పోల్చిన, ఆ రెండు బుద్ది యొక్క భావనలు మాత్రమేనని గ్రహించాలి. అవి ఎప్పటికి శాశ్వతమైన బ్రహ్మమునకు చెందినవి కావు.

573. అందువలన బంధనములు, విముక్తి అనేవి మాయ వలన సృష్టింపబడినవి. ఏవిధముగా ఉన్నతమైన ఆత్మకు అడ్డంకులు ఏర్పడతాయి? దానికి ఎలాంటి భాగాలు లేవు. అది ఏ పని చేయదు. ప్రశాంతముగా తొలగించుటకు వీలులేనిది. ఏవిధమైన కళంకము లేనిది. దానికి మించి రెండవది ఏదీలేదు. అది శాశ్వతమైన ఆకాశము వంటిది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 176 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 33. Attachments -2 🌻

571. Bondage and Liberation are attributes of the Buddhi which ignorant people falsely superimpose on the Reality, as the covering of the eyes by a cloud is transferred to the sun. For this Immutable Brahman is Knowledge Absolute, the One without a second and unattached.

572. The idea that bondage exists, and the idea that it does not, are, with reference to the Reality, both attributes of the Buddhi merely, and never belong to the Eternal Reality, Brahman.

573. Hence this bondage and Liberation are created by Maya, and are not in the Atman. How can there be any idea of limitation with regard to the Supreme Truth, which is without parts, without activity, calm, unimpeachable, taintless, and One without a second, as there can be none with regard to the infinite sky ?


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2022

No comments:

Post a Comment