నిర్మల ధ్యానాలు - ఓషో - 131
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 131 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మార్మికుడి దృష్టిలో ప్రశ్నలుండవు. అతను ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తాడు. అతను అస్తిత్వం గురించి ఆలోచించడు. అస్తిత్వాన్ని అనుభూతి చెందుతాడు. జీవితం రహస్యం. జీవించాల్సింది. జీవితం పరిష్కరించాల్సిన సమస్య కాదు. దాంట్లో జీవించు, ఆనందించు, ఆమోదించు. తాత్వికంగా వుండడానికి ప్రయత్నించకు. మార్మికుడిగా వుండు. ఆనందమంతా నీదే. 🍀
జీవితం వచనంలా కాదు, కవిత్వంలా కనిపించాలి. అది మత దృష్టితో చూడాల్సిన పద్దతి. మార్మికుడి దృష్టి అది. అతని కళ్ళలో ప్రశ్నలుండవు. అతను ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తాడు. అతను అస్తిత్వం గురించి ఆలోచించడు. అస్తిత్వాన్ని అనుభూతి చెందుతాడు. అతను తన హృదయాన్ని విప్పుతాడు. అతను మేధస్సును పక్కన పెట్టి హృదయ ద్వారాలు, కిటికీలు తెరుస్తాడు. అతను సూర్యుణ్ణి, గాలిని, వర్షాన్ని లోపలికి అనుమతిస్తాడు. నేను కవిత్వమనేది దాన్నే అంతిమంగా మార్మికుడంటే కవే. అతను కవిత్వం రాయకపోవచ్చు. అసలు రాయడమన్న దాంతో సంబంధమే లేదు. అతను కవిత్వంలో జీవిస్తాడు. అతనే కవిత్వం. తల గురించి పూర్తిగా మరిచిపోండి. తల లేకుండా పూర్తిగా హృదయంగా మారిపోండి.
జీవితంలో సమస్యలంటూ లేవు. అన్ని సమస్యలూ మనసు సృష్టులే. జీవితం రహస్యం. జీవితం జీవించాల్సింది. జీవితం పరిష్కరించాల్సిన సమస్య కాదు. దాంట్లో జీవించు, ఆనందించు, ఆమోదించు, ఆహ్వానించు, దాంతో కలసి నాట్యం చేయి. తాత్వికంగా వుండడానికి ప్రయత్నించకు. ఆనందమంతా నీదే. అప్పుడు నువ్వు అంతిమ ఆనందభాండాన్ని అందుకుంటావు. అదే దేవుని కారుణ్యం. అది కవులకు మాత్రమే అందుకోదగింది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
04 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment