నిర్మల ధ్యానాలు - ఓషో - 133
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 133 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తి హీనుడవుతాడు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. 🍀
మనిషి వునికితో కలిసి వున్నంత వరకు శక్తివంతుడు. ఏ క్షణం ఉనికి నించీ వేరవుతాడో ఆ క్షణంలో శక్తిహీనుడవుతాడు. ఉనికితో సంబంధమున్నపుడు అసాధారణ శక్తిమంతుడవుతాడు. వేరయితే బలహీనుడు, లక్షలమంది దురదృష్టవశాత్తు ఉనికితో వేరయి వుంటారు. అందువల్ల అనంత దు:ఖం అనంత శూన్యం అనంత నిష్ఫలం. ప్రతి మనిషీ ఎప్పుడో ఒకసారి జీవితం నిష్ఫలంగా భావిస్తాడు. దాంట్లో అర్థమే కనిపించదు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి భయపడతాడు కాబట్టి కొన్నిసార్లు బతికి వుంటాడు.
మరణమంటే భయపడతాడు కాబట్టి శూన్యమయిన జీవితాన్ని జీవిస్తాడు. మరణంలో ఏ జరుగుతుందో మరణానంతరం ఏం జరుగుతుందో వ్యక్తికి తెలీదు. కాబట్టి జీవితాల్ని లాగిస్తారు. ఇదంతా వునికితో సంబంధాన్ని కోల్పోవడం వల్ల జరిగేది. మతమన్నది మనిషికి ఉనికితో సంబంధం కలిగించేది. అప్పుడు వ్యక్తిలో అనంత శక్తులు నిండుతాయి. పొంగి ప్రవహిస్తాయి. అవి యితరులో పంచుకున్నా తరగవు. అవి యిచ్చే కొద్దీ పెరుగుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
08 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment