మైత్రేయ మహర్షి బోధనలు - 77
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 77 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 63. శిష్య పరీక్ష 🌻
సద్గురువు శిష్యుల నెన్నుకొనుటలో మూడు పరీక్షలు పెట్టును. అందు మొదటిది, శిష్యుని దృక్పథము. అతనియందు ఇతరుల శ్రేయస్సును గూర్చిన భావ మెక్కువగ నున్నదా లేక తన శ్రేయస్సును గూర్చిన భావ మెక్కువగ నున్నదా? - తన శ్రేయస్సు గూర్చి భావమున్న వానిని శిష్యునిగ అంగీకరించినచో సద్గురువునకు తిప్పలు తప్పవు. అతని వలన సద్గురువు అపఖ్యాతి చెందగలడు.
రెండవది : ధర్మమును, దైవమును సమర్థించు బుద్ధి యున్నదా? లేదా? ధర్మమును సమర్థించనివాడు దైవమును సమర్థించనివాడే. ధర్మమునందు విశ్వాసము లేనివారు ధర్మసంస్థలలో యున్నప్పుడు, వారు నిర్వహింపబడుచున్న కార్యములకు విఘ్నములు కలిగింతురు. ధర్మానుష్ఠానబుద్ధి లేనివారిని శిష్యునిగ అంగీకరించుటలో చాల అపాయముండును. లోక శ్రేయస్సు, ధర్మము నందు విశ్వాసము గలవానినే శిష్యునిగ చేర్చుకొనవలెను. మూడవది : స్వంతముగ ఆలోచించగలిగిన శక్తి, కార్య నిర్వహణాదీక్ష, ఇది లేనివారు గురువునకు బరువే. శిష్య వ్యామోహము లేక, పై మూడు విషయములను పరిశీలించి శిష్యునంగీకరించ వలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
22 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment