🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 17 / Agni Maha Purana - 17 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. అయోధ్యాకాండ వర్ణనము - 4 🌻
గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది. రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.
అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను. పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి.
వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి. శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.
రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను.
రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.
ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -17 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 6
🌻 Ayodhya Kand - Vishnu as Rama -4 🌻
36. With an arrow (Rāma) plucked one of the eyes of the crow which was tearing her (Sītā) with (its) nails. Then the crow sought refuge in the celestials.
37-40. On the sixth day after Rāma had gone to the forest, the king told Kauśalyā in the night the past story of how in (his) youth he had killed unknowingly with (his) Śabdabheda[5] (weapon) the ascetic youth Yajñadatta as (he was filling) the pot raising a sound. Lamenting his father cursed (Daśaratha). His mother felt grief-stricken and wept again and again and the (two) said, “We will die without the son. You will also die of grief.” “O Kauśalyā! without the son and remembering (the past) my death (will come off now) on account of grief.” After narrating this story and uttering (the words) “Alas! Rāma!”, the king passed away.
41-42. Thinking that the king was sleeping, Kauśalyā also slept on account of pangs of grief. Early in the morning the singers and bards such as the sūtas, māgadhas, the awakeners attempt ed to wake him up. He did not wake up and was dead. Knowing him as dead, Kauśalyā said, “O I have been ruined.”
43. The men and women then wept. Then Bharata along with Śatrughna was hurriedly brought to the city from the royal palace by Vasiṣṭha and others.
44. Having seen the grief-stricken Kaikeyī he reproached (her) out of grief. “(You) have made censure fall on the head” and praised Kauśalyā.
45-46. Having done the funeral rites of his father when (he) was asked by Vasiṣṭha and others to rule the kingdom, he said, “I go now to bring back Rāma. Rāma is the king stronger than myself”. (He went) to Śṛṅgavera and to Prayāga where he was entertained by Bharadvāja.
47-48. Having saluted Bharadvāja, (Bharata) came to Rāma and Lakṣmaṇa (and said), “O Rāma! Our father has reached the heaven. You become the king of Ayodhyā. I will go to the forest adhering to your command.” Having heard this, Rāma (after) giving him water asked him to go (back) taking the sandals.
49. (Bharata said), “I will not go to the city. I swear, I will be remaining with matted locks.” On being urged by Rāma, Bharata returned to Nandigrāma and stationed there with his army, leaving the sandal at Ayodhyā and worshipping it ruled over the kingdom.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
10 Mar 2022
No comments:
Post a Comment