మైత్రేయ మహర్షి బోధనలు - 86


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 86 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 72. సౌందర్య ఉపాసనము 🌻



విసుగు, చిరాకు, కోపము మనిషియందు విషమును పుట్టించును. పుట్టిన విషము నాడులగుండా ప్రవహించి దేహ మంతయు మలినము చేయును. అట్టి వారికి రకరకములైన మందులు వేయుటతో మరికొంత ప్రమాదము జరుగును. వారికి తగిన చికిత్స విశ్రాంతి. వారికి ఎంత విశ్రాంతి ఏర్పరచిన అంత స్వస్థత చేకూరును.

సుందరము, పవిత్రము, ప్రశాంతము అయిన ప్రదేశములలో జీవించుట ఇట్టి రోగులకు అతిముఖ్యము. ప్రకృతి సహజ సౌందర్యము నుండి ఉద్భవించు తరంగములు ఎట్టి విషపూరిత రోగమునైనను పరిష్కరించ గలదు. సౌందర్యోపాసన ప్రాణమునకు బలము నిచ్చును. ఈ ఉపాసన సహజముగ సాగవలెను.



సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2022

No comments:

Post a Comment