శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 354-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 354-2. “పశుపాశ విమోచనీ' 🌻


మూలము రకరకములుగ స్థితి భేదము చెందుచు నుండును. వివిధములగు గుణములను సంతరించుకొనుచుండును. అంత మాత్రమున మూలము కాకుండునా? వొట్టిపోయిననూ గోవు గోవే కదా! విరిగి పోయిననూ బంగారపు వస్తువు బంగారమే కదా! మూలమునకు ఎప్పుడునూ చేటు లేదు. దైవమే తానుగ నున్నాడని తెలిసిననూ అది అను నిత్యమూ గుర్తుండుట వీలుపడని విషయమై యున్నది. దానికి కారణము శ్రీమాత మాయయే. ఆమె మహామాయ.

మాయ వలన జీవుడు తాను వేరుగ నున్నాడని భావించును. ఈ భావన ఆధారముగ జీవుడు ఆశ పడును. ఆశపడుట వలన పాశ మేర్పడును. పాశ మనగా పా, ఆశ్ ధాతువుల సమాహారము. ఆశ గలవా రగుటచేత జీవులు పాశాబద్ధు లగుచుందురు. ఆశాపాశము ఒకదాని నొకటి బలపరచు కొనుచు జీవుని పశువును బంధించునట్లు బంధించును. ఆకలి, దప్పిక, పూరింప లేని కోరికలు ఇత్యాదివి కలిగి బంధింపబడును. ఇట్టి పాశములనుండి రక్షింప గలిగినది శ్రీమాతయే. కోరికలతో తిరుగాడు జీవునకు శివునిపై కోరిక కలిగించి పాశముల నుండి విమోచనము కలిగించును. దైవమును చేరగోరు సంకల్పమే శివము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 354-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 354-2. Paśu-pāśa-vimocanī पशु-पाश-विमोचनी 🌻

Liṅga Purāṇa says paśu-s are the individual souls and pāśa is the bondage and such bondage of paśu-s are destroyed by Paśupatī, the Lord of all paśu-s (Śiva).

It is better to know a little more on paśu as this word is more frequently used in many Upaniṣads. Śiva Sutra I.2 says jñānam bandhaḥ. Jñānam means vitiated knowledge and bandhaḥ means bondage. Limited knowledge is ignorance. Ignorance is the cause for bondage that veils the true Brahman. This phenomenon is called āṇava mala. Mala has been explained as ignorance that hampers the free expression of the Brahman. Āṇava mala means innate ignorance of the soul. Āṇava is the word derived from the root aṇu which means the empirical individual.

This āṇava mala is subdivided into two. The first one is the ignorance innate in the very being of the individual Self and other is ignorance inherent in the intellect or buddhi. The āṇava mala is the cause of bondage. Those who are afflicted by such āṇava mala undergo birth and death. This nāma says that She removes this āṇava mala for Her devotees, which is a precondition for final liberation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2022

No comments:

Post a Comment