మైత్రేయ మహర్షి బోధనలు - 100


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 100 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 81. ఊహాస్త్రము -1 🌻


ఒక స్త్రీ నీటి కుండను ధరించి బాటలో మసలుచున్నప్పుడు, ఆ నీరెవరి దాహము కొరకో మీకు తెలియునా? నేతవాడొక చీరను నేయునప్పుడు, ఆ చీరను ఎవరు ధరింతురో మీకు తెలియునా? ఒక ముఖద్వారము మూసి యున్నప్పుడు అందుండి ఎవరు ఏతెంతురో నీకు తెలియునా? నీతో ప్రయాణము చేయువారు ఏ కారణమునకు ప్రయాణించుచున్నారో నీకు తెలియునా? పిడుగు పడినప్పుడు అది ఎవరి ప్రాణములు తీయునో తెలియునా? ఎవరెందులకెట్లు ప్రవర్తించుచున్నారో నీకు తెలియునా?

నీకేమీ తెలియదు. తెలియక పోయినను నీకు తోచినట్లు ఊహింతువు. నీ ఊహల నుండి అభిప్రాయము లేర్పరచు కొందువు. అభిప్రాయము లాధారముగ చూచుటచే, అవి బలపడి నమ్మక మేర్పడును. అపనమ్మక మేర్పడును. అంతయూ ఊహాజనితమే. సాధారణముగ నీవు నమ్ము మంచి, చెడు అంతయూ ఊహాజనితమే. అది నీ మనసు నీకు చూపించు సినిమా.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

07 Apr 2022

No comments:

Post a Comment