నిర్మల ధ్యానాలు - ఓషో - 161


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 161 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. జీవితం ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. 🍀

జీవితమంటే పూల కుప్ప కాదు, లేదా పూలదండ కాదు. ఆ పూలకు ఎట్లాంటి సమన్వయం లేదు. నువ్వు ఎన్నో 'నేను'ల గుంపు. ఎన్నో సంఘర్షణల, కష్టాల, ఆధిపత్యాల కలయిక. మనిషి నిరంతరం అంత:సంఘర్షణలో వుంటాడు. ప్రతి నేనూ తన వేపుకు లాగుతూ వుంటుంది. నువ్వు ముక్కలు ముక్కలుగా రాలిపోతూ వుంటావు. జీవితం విభిన్నంగా జీవించాలి. వేరయిన పూలని దారంతో ఒకటిగా చేర్చాలి. వాటి గుండా ఒక అంతస్సూత్రమేర్పడాలి. ఒక దృక్కోణంతో, మెలకువతో, మరింత చైతన్యంతో ఏకసూత్రత ఏర్పడాలి. అప్పుడు జీవితం కేవలం యాదృచ్ఛికం కాదు. అప్పుడు అది 'గుంపు' కిందకు రాదు.

అప్పుడు నీకు అస్తిత్వంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మరింత ఆనందానికి అవకాశముంది. నువ్వు ఎంతగా సంబంధం కలిగి వున్నామున్న దానిపై నీ ఆనందం ఆధారపడి వుంటుంది. శకలాలుగా విడిపోయిన మనిషి దు:ఖంలో వుంటాడు. బాధల్లో వుంటాడు. సమన్వయమున్న మనిషి సంతోషాన్ని అందుకుంటాడు. నువ్వు దారంగా మారితే నీ జీవితంలోని పూలని ప్రేమ నిండిన సమన్వయంలో దగ్గరికి చేరుస్తావు. అప్పుడు జీవితం కేవలం రణగొణధ్వనులు గాక సంగీత సమ్మేళన మవుతుంది. అక్కడ గొప్ప సౌందర్యం, గొప్ప సంతోషం వికసిస్తాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

07 Apr 2022

No comments:

Post a Comment