మైత్రేయ మహర్షి బోధనలు - 106
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 106 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 84. సాధన - సూత్రము 🌻
ఒంటె మోయునంత బరువు గాడిద మోయగలదా? ఎవరెంత వరకు మార్గమున వినియోగ పడుదురో అంతవరకే వారికి శిక్షణ నీయవలెను. జీవతత్త్వము ఒక జన్మమున కొంతవరకే సాగును.అంతకుమించి సాగదు. మించి సాగదీసినచో తెగును. పదార్థము నందు ఆసక్తి గలవారిని పరమార్థములో వేసి త్రొక్కుట అపాయకరము. పరమార్థమును చేరు ప్రయాణమున కూడా సాగినంత వరకే నడక. అందరునూ ఒకే మారుగ గుడి మెట్లెక్కలేరు. కొందరు ఆగి ఆగి ఎక్కుదురు. ఆగకూడదన్నచో అసలే ఎక్కరు. సత్య మార్గమున నడచు జీవులు కూడ అదియే పనిగ నడక సాగించలేరు. కొంత ఆగుట యుండును. కొంత మరచుట యుండును. కొంత ప్రక్కదారుల యందు పోవుట యుండును.
కాలము, కర్మమును బట్టి వేగము, నెమ్మదితనము, మరపు, ప్రక్కదారి, విశ్రాంతి మార్గమున సహజములు. అపుడపుడు, కొంత పదార్థమయమైన జీవనము కూడ అవసరము. దాని వలన పొందు అనుభవము పరమార్థమయ జీవనమున కుపయోగించును. పదార్థమయ అనుభవము లేనివాడు పరమార్ధమును చేరుట వట్టిమాట. పరమార్ధము కోరని వానిని ఆ మార్గమున నిర్బంధించుట పందికి మూతి కడిగినట్లే నిష్ప్రయోజనము. బోధకుడీ విషయమును గ్రహించి జీవులను నడిపింపవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
19 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment