నిర్మల ధ్యానాలు - ఓషో - 167
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 167 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. నువ్వు బాధని ఆహ్వానించక పోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు. 🍀
నేను దేవుణ్ణి అని తెలుసుకోవడం అంటే నేను ఆకాశాన్ని అని గ్రహించడం. జీవితంలో వచ్చే అనుభవాలన్నీ చిన్ని మేఘాల లాంటివి. అవి వస్తుంటాయి. పోతుంటాయి. అవి పెద్దగా గుర్తుంచుకోవాల్సినవి కావు. పట్టించుకోకు. అది నీ ధ్యానం కానీ. ఎప్పుడూ నిన్ను నువ్వు ఆకాశంగా భావించు. అనంతమయిన ఆకాశంగా భావించు. ఎట్లాంటి మేఘాలూ నీకు ఆటంకం కలిగించకుండా వుండనీ. క్రమక్రమంగా మేఘాలు వస్తూ వుండటం ఆగిపోతుంది. పిలవనిదే అవి రాని పరిస్థితి ఏర్పడుతుంది.
నువ్వు బాధని ఆహ్వానించకపోవచ్చు. నువ్వు ఆనందాన్ని ఆహ్వానిస్తావు. కానీ బాధ, ఆనందం ఒకే నాణేనికి రెండు ముఖాలు ఒకదాన్ని ఆహ్వానిస్తే యింకొకటి వస్తుంది. అవి వేరుగా వుండవు. ఎప్పుడూ కలిసే వుంటాయి. నువ్వు ఆ అతిథుల్ని ఆహ్వానించడం అపేస్తే అవి అదృశ్యమవుతాయి. అప్పుడు క్రమంగా ఒక స్థితి వస్తుంది. మేఘాలు లేని స్థితి ఏర్పడుతుంది. మబ్బులు వుండవు. బుద్ధుడు దాన్నే నిర్వాణమన్నాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
19 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment