మైత్రేయ మహర్షి బోధనలు - 107


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 107 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 85. పూర్ణ యోగము-1 🌻

జీవిత మందలి ప్రతి సన్నివేశము, జీవపరిణామమునకే. విఘ్నములు, విఘాతములు, అంతరాయములు నిజమునకు లేవు. అవి అన్నియు జీవుని పరిపూర్ణత్వము కొఱకే. కామి కాని వాడు మోక్షకామి కాదు. సమస్త విషయములు అనుభవ పూర్వకముగ తృప్తి చెందుచు, ముందుకు సాగుటకే జన్మపరంపరలు. కొన్ని జన్మలలో కొన్ని సిద్ధించును, కొన్ని సిద్ధింపవు. మరికొన్నిటియందు అశ్రద్ధ యుండును. ఇంకొన్నిటి యందు నిర్లక్ష్యముండును.

శిల్పము, చిత్రము అందముగ తయారుకావలెనన్నచో దానిని సర్వసుందరముగ తీర్చిదిద్దవలెను. మిగుళ్ళు, తగుళ్ళు పనికిరావు. దరిద్రునికి ధనానుభవము, ధనికునికి దారిద్ర్యానుభవము అవసరము. ఆకలి అనుభవము, సమృద్ధి అనుభవము కలుగవలెను. కష్టసుఖముల అనుభవములు తెలియవలెను. లాభ నష్టములను తెలియవలెను. జయాప జయములను తెలియవలెను. స్త్రీ జన్మను, పురుష జన్మను కూడ తెలియవలెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


21 Apr 2022

No comments:

Post a Comment