మైత్రేయ మహర్షి బోధనలు - 115


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 115 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. తగ్గింపు ధరలు 🌻



ప్రచోదనము కావించుటయే కాని ప్రచారము చేయుట మా మార్గము కాదు. ఆకలిగొన్న వారి కన్నము పెట్టుటకై అన్నదాన సత్రము లుండవలెను. ఆకలిలేని వారికి తినిపించినచో, అతని అజీర్తికి బాధ్యత అన్నదాతదే అగుచున్నది కదా! తమను తాముద్ధరించుకొను ఆసక్తి కలవారికే జ్ఞానము.

ఇతరులకు జ్ఞానమందించుట బాధ్యతారహితమగు చర్య. దాని పర్యవసానము తెలియుట ఆవశక్యకము. ప్రచారకులు జీవుల నాకర్షించి వారికి మార్గమును చూపుటలో తమ మెడకు గుదిబండలు వేసుకొనుచున్నారు. తమపై నాధార పడువారిని పెంచుకొను చున్నారు. వారి యందు గురుత్వము వహించుటకై పాటుపడుచున్నారు. ఇట్టివారు వ్యామోహమున పడి జీవనము బరువు చేసుకొనుచున్నారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 May 2022

No comments:

Post a Comment