నిర్మల ధ్యానాలు - ఓషో - 176
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 176 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ. నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలిన పరచదు. అదే అంతిమ చైతన్యం. 🍀
నువ్వు ఎంపిక లేని చైతన్యంతో వుండడమే స్వచ్చత. అక్కడ నువ్వు మంచి, చెడుల స్పృహలో వుండవు. అట్లాంటి విభజన చెయ్యవు. నువ్వు ప్రతిదీ దైవికంగా, భావించినపుడు విభజన మాయమవుతుంది. కాంతిలో, చీకటిలో చివరికి మరణంలో నువ్వు శాశ్వత జీవితాన్నే చూస్తావు. సాధారణంగా విషయాల్ని చూస్తే ద్వంద్వ వైఖరి వదిలిపెట్టాలి. నీ స్వచ్ఛత వల్ల ఏదీ నిన్ను మలినపరచదు. అదే అంతిమ చైతన్యం. మనం ద్వంద్వాలను రూపాంతరం చెందించాలి.
నీతి అవినీతి, మంచి చెడ్డ, జీవితం, మరణం, వేసవి, చలికాలం ఈ విభజన వదిలిపెట్టాలి. రూపాంతరం చెందించాలి. అప్పుడు ఒకటే వుంటుంది.అది సాధ్యం. దానికి కొంత మెలకువ అవసరం. ఎంపిక లేని చైతన్యం అవసరం. లోపల కూర్చుని మనసుని ఏదీ ఎంపిక చెయ్యకుండా పరిశీలించడం చెయ్యాలి. ఆలోచన ప్రవాహం సాగుతూ వుంటుంది. నిశ్శబ్దంగా నిర్మలంగా కూచుని పరిశీలించాలి. మెల్లగా స్వచ్ఛత మొలకెత్తుతుంది. స్వచ్ఛతే స్వేచ్ఛ.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
08 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment