మైత్రేయ మహర్షి బోధనలు - 117
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 117 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 91. జీవుని అశ్రద్ధ -1🌻
మానవుడు ధనము విషయమున మాత్రమే జాగ్రత్త వహించి యున్నాడు. శ్రద్ధ కలిగి యున్నాడు. దీనికి కారణము ధనము వలన సర్వ సుఖములు పొందగలడనెడి భావము, అనారోగ్యము కలిగినప్పుడే ఆరోగ్యమును గూర్చి భావన చేయుచున్నాడు. అందు శ్రద్ధ అంతంత మాత్రమే.
భూమి, నీరు, గాలి యిత్యాది పంచభూతముల యెడల అతనికి శ్రద్ధ లేదు. అందువలననే పంచభూతములకు కూడ మానవుని యందు విముఖములగుచున్నవి. పంచభూతముల విలువ తెలియని మానవులకు వారి నధిష్టించి యున్న మనసు విలువేమి తెలియును? ఆలోచనల విలువేమి తెలియును?
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
12 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment