మైత్రేయ మహర్షి బోధనలు - 119
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 119 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 92. ఆత్మ హంతకులు -1🌻
మేమందించు బోధనలు ఏమి చేయవలెను? అనునది ప్రశ్న. కేవలము మౌనముగ ఆచరింపవలెను అనునది సమాధానము. ఆచరించుట ప్రథమ కర్తవ్యము. దాని ఫలము అనుభూతి. అనుభూతి ఆచరణకు సువాసన కలిగించును. అట్టి సువాసనకు అన్వేషకులాకర్షింప బడుదురు. ఆకర్షింపబడినవారికి వారి శ్రద్ధననుసరించి మా బోధలందించ వలెను.
సత్యాన్వేషకులు అన్వేషణ మార్గమున మా బోధనల సమీపమునకు చేరుదురు. అన్వేషణ లేనివారు చేరలేరు. బోధనలనాచరించుటయే ప్రమాణము కాని జీవుల నాకర్షించుట ప్రమాణము కాదు. జీవులు ఆకర్షింపబడినపుడు బోధనము చేయుటకు ఉత్సహింపక, ఆచరణమార్గమున చూపుటయే నిజమైన బోధన. నిజమునకు ప్రవర్తనయే ప్రవచనము. కేవలము ప్రవచనములో ఉపయోగ మేమియును లేదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment