🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 601/ Vishnu Sahasranama Contemplation - 601🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻601. శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ🌻
ఓం శ్రీవత్సవక్షే నమః | ॐ श्रीवत्सवक्षे नमः | OM Śrīvatsavakṣe namaḥ
శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ
చిహ్నం శ్రీవత్ససఙ్జ్ఞం హి వక్షస్యస్య స్థితం హరేః ।
ఇతి శ్రీవత్సవక్షా ఇత్యుచ్యతే విదుషం వరైః ॥
శ్రీవత్సము అను సంజ్ఞ కల చిహ్నము ఈతని వక్షమునందు కలదుగనుక హరికి శ్రీవత్సవక్షాః అను నామముగలదు.
:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
వ.మఱియు న ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండును, బిశంగవర్ణవస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనక కాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున. (507)శా.చింతం బాసిరి యక్షతార్క్ష్యసుమనస్సిద్ధోరగాధీశ్వరుల్సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్. (508)
వామనుడు జన్మించినపుడు అతనికి నాలుగు చేతులూ, ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదాపద్మములు ఉన్నాయి. గోరోజనరంగు వస్త్రమూ, మకర కుండలాలలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. రత్నములు కూర్చిన బంగారు ఒడ్డాణము, బాహుపురులూ, కిరీటమూ, హారములూ, కాలి అందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన, కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపము అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది.
వామనుడు పుట్టగానే, యక్షులూ, గరుడులూ, సిద్ధులూ, నాగులూ, చింతలు విడిచినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ, సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశములో నాట్యములుజేసినారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 601🌹
📚. Prasad Bharadwaj
🌻601. Śrīvatsavakṣāḥ🌻
OM Śrīvatsavakṣe namaḥ
चिह्नं श्रीवत्ससङ्ज्ञं हि वक्षस्यस्य स्थितं हरेः ।
इति श्रीवत्सवक्षा इत्युच्यते विदुषं वरैः ॥
Cihnaṃ śrīvatsasaṅjñaṃ hi vakṣasyasya sthitaṃ hareḥ,
Iti śrīvatsavakṣā ityucyate viduṣaṃ varaiḥ.
Since there is a mark called Śrīvatsa on His bosom, He is called Śrīvatsavakṣāḥ.
:: श्रीमद्भागवते अष्टमस्कन्धे अष्टादशोऽध्यायः ::
श्यामावदातो झषराजकुण्डलत्विषोल्लसच्छ्रीवदनाम्बुजः पुमान् ।
श्रीवत्सवक्षा बलयाङ्गदोल्लसत्किरीटकाञ्चीगुणचारुनूपुरः ॥ २ ॥
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 18
Śyāmāvadāto jhaṣarājakuṇḍalatviṣollasacchrīvadanāmbujaḥ pumān,
Śrīvatsavakṣā balayāṅgadollasatkirīṭakāñcīguṇacārunūpuraḥ. 2.
The body of the Lord, blackish in complexion, was free from all inebrieties. His lotus face, decorated with earrings resembling sharks, appeared very beautiful, and on His bosom was the mark of Śrīvatsa. He wore bangles on His wrists, armlets on His arms, a helmet on His head, a belt on His waist, a sacred thread across His chest, and ankle bells decorating His lotus feet.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
16 May 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
16 May 2022
No comments:
Post a Comment