మైత్రేయ మహర్షి బోధనలు - 120


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 120 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 92. ఆత్మ హంతకులు -2 🌻


ప్రవచనమున కాకర్షింబడక, ప్రవర్తనకు ఆకర్షింపబడుటకు శ్రద్ధయొక్కటియే పునాదికాగలదు. శ్రద్ధ కలిగి ప్రవర్తనయందు నిమగ్నమైన వానిని నిర్లక్ష్యము, మోసము అను శక్తులు స్పృశింప జాలవు. ఎట్టి సాధకునైనను ఈ రెండు శక్తులును మ్రింగి వేయగలవు. తనయందు మోసమున్నదో? లేదో? తెలియుటకు తనకన్న మించిన వారు లేరు. అట్టి వారికి సాక్ష్యమే అవసరములేదు. అంతరాత్మయే అన్నిటికిని సాక్ష్యము, అది మరుగున పడినచో, అట్టివారు ఆత్మహంతకులే!

ఆత్మహంతకులకు సాక్ష్యము చూపినను చూడలేరు. ఆత్మవంతులకు సాక్ష్యమే అక్కర లేదు. సాక్ష్యము ఒక మాయ. అందులకే నిజమైన భక్తులు ఎవరూ సాక్ష్యము కోరలేదు. ఆత్మయే సాక్షిగ నిలబడినారు. వారు ఆత్మవంతులు. ఆత్మహంతకులకు, ఆత్మవంతులు అర్థము కారు. కృష్ణుడు, రాముడు లాంటి దివ్యులు అర్థమగుటకు ఆవగింజంత ఆత్మ చైతన్యము ఉండవలెను..


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 May 2022

No comments:

Post a Comment