నిర్మల ధ్యానాలు - ఓషో - 181


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 181 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది. 🍀


మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. స్వచ్ఛ స్ఫటికంగా, శుభ్రంగా అడుగు పెట్టాం. అప్పుడు ప్రపంచం మన చైతన్యం మీద తన రాతలు మొదలు పెట్టింది. అదుపు చెయ్యడం ఆరంభించింది. మలిన పరిచింది, విషపూరితం చేసింది. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది.

అంతర్దృష్టిని అంధకారమయం చేసి వుంటుంది. అతను తన కాళ్ళ మీద తను నిలబడలేడు. అది అతన్ని ఆధారపడేలా చేస్తుంది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన గొప్ప కుట్ర అది. ఆధ్యాత్మిక పతనం సమాజం నీ మనసును ఆలోచనల్తో, కోరికల్తో, అత్యాశల్తో నింపి వుంటుంది. అహంకారంతో నింపి వుంటుంది. ఒక పొరపై ఒక పొర పేరుకుని వుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 May 2022


No comments:

Post a Comment