మైత్రేయ మహర్షి బోధనలు - 121
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 121 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 93. సర్వహుత యజ్ఞము 🌻
ఆత్మవంతులు కొందరు బోధన చేయుదురు. కొందరు మౌనముగ నుందురు. కొందరు ప్రేమ, దయ పంచుచుందురు. కొందరంతర్ముఖులై యుందురు. దేహాభిమానము గల జీవుడు దైవాభిమానము కారణముగ పరిణితి చెంది ఆత్మవంతుడగును. దేహాత్మ భావనను వీడి జీవాత్మ భావనను పొంది పరమాత్మతో అనుసంధానము గావించుచున్నాడు. పరమాత్మానుసంధానము కారణముగ అతని యందు కొన్ని శక్తులుద్భవించును. వచ్చిన శక్తులను సిద్ధులను వినియోగించుటలో అతనికి బాధ్యత యున్నది.
సర్వజన శ్రేయోదాయకముగ నిర్వర్తించుట కర్తవ్యము. అట్టి కర్తవ్య నిర్వహణమున జీవుడు పురుషమేధ యజ్ఞము నిర్వర్తించుట జరుగును. తన దగ్గర చేరిన వాని నన్నంటిని జీవ శ్రేయస్సుకై సమర్పణ చేయుట చేసి, అటుపైన తనను కూడ సమర్పణ చేసుకొనుట పురుషమేధ యజ్ఞము. ఇది సర్వహుత యజ్ఞము. ఇందు జీవుడు తనతో సహా సమస్తమును సమర్పణ చేయును. సర్వము ఆహుతి యగుటయే సర్వహుత యజ్ఞము. వేదమున ఈ యజ్ఞము కీర్తింపబడినది. శ్రీకృష్ణుని జీవితమట్లు సాగినది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
20 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment