మైత్రేయ మహర్షి బోధనలు - 124


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 124 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 96. జాతులు - కులములు 🌻


మైత్రేయ మార్గమున తెలుసుకొనుచు ఆచరించుటయే కాని తెలియచెప్పుటయుండదు. తెలియచెప్పుట వలన తెలుసుకొనుట జరుగదు. ఎదుటివానికి దాహమైనప్పుడు తెలిసికొని త్రాగునీరందిం చుట తెలివి. "మంచి నీరిత్తురా?” అని కోరిన తరువాత ఇచ్చుట అంత తెలివైన పనికాదు. తెలుసు కొనుచు నిర్వర్తించువారు ఉత్తములు. వారికి ఆటంకము లుండవు. తెలియ జెప్పినను, నిర్వర్తించనివారికి ఆటంకములు మెండుగనుండును. మరల, మరల తెలిపినను నిర్వర్తించని వారి విషయమున ఏమి చేయవలెను? వేచి యుండుటయే మార్గము.

ఇట్లు ఆస్తిక సమాజమున నాలుగు జాతులు కనపడుచున్నవి. ఆస్తికులే యిట్లుండ, స్వార్ధపరులు, హింసాత్మకులు, దోపిడి దారులైన మానవుల గూర్చి భావించునపుడు వారు పంచమజాతి వారగుదురు. ఈ పాఠము చదువుకొను పాఠకుడు, తానే జాతివాడో తానుగ నిర్ణయించు కొనవచ్చును. మీ కులము నిర్ణయించు కొనునది మీరే. మార్చుకొనుశక్తి కూడ మీ యందే యున్నది. అది మీకు దైవ మందించిన స్వేచ్ఛ. ఇది తెలుపుట దైవము మాకందించిన కర్తవ్యము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

26 May 2022

No comments:

Post a Comment