నిర్మల ధ్యానాలు - ఓషో - 185
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 185 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతిమనిషీ దేవుడిలో భాగమే. సహజభాగం. ప్రతిమనిషి దైవత్వంతో నిండిన వాడే. నిజం. కొంతమంది దైవత్వం నిండిన వాళ్ళు నిద్ర పోతున్నారు. కొంతమంది మేలుకొని వున్నారు. అది వాళ్ళ వాళ్ళ యిష్టం. 🍀
నువ్వు తెలివి తక్కువ వాళ్ళని నమ్మడం తప్ప నీలో ఎలాంటి లోపం లేదు. నీ హృదయాన్ని నువ్వు వినకపోవడం లోపం. హృదయాన్ని కాక ఏమీ తెలియని వాళ్ళ మాటలు వింటున్నావు. ఆ అరువు తెచ్చుకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టు. నువ్వు పాపినని, పాపాన్ని తెచ్చుకున్నావని చెప్పె గాలి కబుర్లని వదిలిపెట్టు. కట్టుకథల్ని నమ్మకు. ప్రతిమనిషీ దేవుడిలో భాగమే. సహజభాగం. ప్రతిమనిషి దైవత్వంతో నిండిన వాడే. నిజం. కొంతమంది దైవత్వం నిండిన వాళ్ళు నిద్రపోతున్నారు. కొంతమంది మేలుకొని వున్నారు. అది వాళ్ళ వాళ్ళ యిష్టం.
నిద్రపోవడంలో కూడా తప్పు లేదు. కొన్ని పీడకలలు రావచ్చు. కానీ వాటి గురించి భయపడాల్సిన పన్లేదు. కొద్ది కాలంలో మేలుకుంటావు. నీకు అది ఆనందం కలిగిస్తే ఆనందించు. దాంట్లో వేలు పెట్టే అధికారమెవ్వరికీ లేదు. నువ్వు మేలుకోవడాన్ని నేను యిష్టపడతాను. నీకు నిద్ర వుండడం యిష్టం లేకుంటే నిన్నెవరూ నరకంలో తోసెయ్యరు. నిద్రలో మునిగి వుండడం వల్ల యిప్పటికే చాలా బాధలు పడ్డావు. మరింత బాధలు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి బద్ధులకు, మేలుకున్న వాళ్ళకు మధ్య వున్న అంతరమిదే. లేకుంటే అందరూ ఒకలాంటి వాళ్ళే. వాళ్ళలో ఒకే రకమయిన శక్తి వుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment