శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 369 / Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀


🌻 369. 'పరదేవతా’🌻


శ్రీదేవి ఉత్కృష్టయైన దేవత అని అర్ధము. 'పర' అనగా సృష్టికి ఆవలి అని అర్థము. సృష్టికి అతీత మని అర్థము. అన్నియూ నిండియుండి ఏమీ లేనట్లుగ నుండు స్థితి. దీనిని గూర్చి తెలియ వలనుపడదు. తెలియుటకు వలయు ప్రజ్ఞ కూడ అందులో ఇమిడి యుండుటచే తెలియుట యుండదు. ఉండుటయే యుండును. అదియే పరమ సత్యము. అందుండి, కాలము ననుసరించి ప్రకృతి ఉద్భవించును. అంతకు మునుపు ప్రకృతి లేదు. పురుషుడును లేడు.

ఈ పరమును 'తత్' అని వేదములు సంబోధించును. సత్యమని కూడ సంబోధించును. "సత్యం పరం ధీమహి” అనునది మహావాక్యము. పరమే సత్యము. సర్వమునకు అతీతము. దానిని ధ్యానించు వారే నిజమగు ధ్యానులు. ఈ పరిస్థితి యందు కాలము లేదు, ప్రకృతి లేదు, పురుషుడు లేడు. ఏమీ లేనట్లుండును. కాని సమస్తము అందే యున్నది. అంతయూ ఇమిడి యున్న స్థితి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 369 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻


🌻 369. Paradevatā परदेवता 🌻


She transports power to other gods and goddesses, meaning that She is the supreme amongst gods and goddesses.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 May 2022

No comments:

Post a Comment