శ్రీ శివ మహా పురాణము - 560 / Sri Siva Maha Purana - 560
🌹 . శ్రీ శివ మహా పురాణము - 560 / Sri Siva Maha Purana - 560 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴
🌻. శివుని కైలాస యాత్ర - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
అచట ఈ విధముగా పరస్పరము గొప్పగా ప్రశంసించుకొనిరి. గొప్ప ఉత్సవము మొదలాయెను. వేదశబ్దము, సాధు కారము, జయధ్వానములు ప్రవర్తిల్లెను (11). మంగలగానము ఆరంభమాయెను. అప్సరసలు నాట్యమాడిరి. వంది మాగధులు స్తోత్రములను చేసిరి. గొప్ప దానములు చేయబడెను (12).
అపుడు హిమవంతుడు దేవదేవుని ఆహ్వానించి తన గృహమునకు వెళ్లెను. యథావిధిగా భోజనోత్సవము ఆరంభమాయెను (13). పరివారముతో గూడి కుతూహలము కలిగియున్న ఈశ్వర ప్రభుని ప్రీతితో యథావిధిగా భోజనమునకు తీసుకు వెళ్లిరి (14).
శంభునకు, విష్ణువునకు, నాకు, దేవతలందరికి, మునులకు పాద్య జలమీయబడెను (15). హిమవంతుడు బంధువులతో గూడి అందరినీ మండపములోపల ప్రేమతో కూర్చండబెట్టెను (16). పర్వతుడు వారిని మధురమగు వివిధ భక్ష్యములతో తృప్తిపరచెను. శంభుడు, విష్ణువు, నేను, ఇతరులు అందరు భుజించితిమి (17). అపుడు పురస్త్రీలు నవ్వుతూ మృదువగు మాటలతో వారిని పరిహాసము చేసి వారిని చూస్తూ ఆనందించిరి (18).
ఓ నారదా! వారందరు భుజించి, యథావిధిగా ఆచమనమును చేసి, పర్వతుని అనుమతిని పొంది సంతుష్టులై ఆనందించి తమ స్థానమును చేరుకొనిరి (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 560 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴
🌻 Description of Śiva’s return journey - 2 🌻
Brahmā said:—
11. Thus there was mutual admiration and glorification of an enlightened nature. There was great jubilation. The sound of Vedic chant and shouts of victory were heard every where.
12. There were auspicious songs. The celestial damsels danced. The bards sang songs of praise. There was a liberal exchange of monetary gifts.
13. Then the mountain took leave of the lord of gods and went home. He made arrangements for a joyous feast with all paraphernalia in accordance with the rules.
14. He brought the lord with all his attendants and followers for the feast. He was very enthusiastic.
15-16. He washed the feet of Śiva, Viṣṇu and mine with reverence. He seated all of us, including the gods, the sages and others in the altar. The lord of mountains was assisted by his kinsmen.
17. The mountain satiated them with various kinds of juicy foodstuffs. All of them took food including Śiva, Viṣṇu and me.
18. Then the ladies of the city indulged in the customary utterance of foul abusive words laughing, jingling and peeping at all of them.
19. O Nārada, they took their food and rinsed their mouths. Taking leave of the mountain they returned to their apartments fully satisfied and pleased.
Continues....
🌹🌹🌹🌹🌹
07 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment