శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 372 -2. 'భక్తమానస హంసికా'🌻


నిశ్చలులు, నిర్మలురు అగు చిత్తము గలవారి యందు శ్రీమాత వసించి అంతరంగానుభూతిని కలిగించు చుండును. నిర్మల చిత్తము కోరువారు శారీరకము, వాఙ్మయము, మనోమయము అగు తపస్సు నాచరించవలెను. అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము యజ్ఞారమై వినియోగించవలెను. లోకహిత కార్యములే యజ్ఞములు. వాని యందు నిమగ్నమగు వానికి క్రమముగ చిత్తము నిర్మలమగుట తథ్యము.

భక్తి సాధనమున గాని, యోగ సాధనమున గాని నిర్మల చిత్తమును పొందుట ప్రధానమగు కార్యముగ నిలచి యున్నది. నిర్మల చిత్తము లేనివారు ఎన్ని దైవకార్యములు చేసిననూ ఫలితము శూన్యమే. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, దొంగబుద్ధి లేకుండుట, ఇతరుల సొమ్మున కాశపడకుండుట, బహిరంతర శుచి, సంతోషము, స్వాధ్యాయము, మనస్సును ఈశ్వరునికి సమర్పణము చేసి జీవించుట నిర్మలత్వమున కుపాయములుగ తెలుపబడినవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻


🌻 372-2. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻


Saundarya Laharī verse 38 provides further information on this nāma. In Hinduism, highly evolved souls are called paramahaṃsa-s (a religious man who has subdued all his senses by abstract meditation) which refers to the qualities of swans. The swans have a few exceptional qualities. If water and milk is mixed, swans consume only the milk leaving water alone.

This is interpreted as that one should take cognizance of only good things, leaving bad things aside, though the world exists as the mixture of the two. Whenever swans are mentioned, they are always referred to in pairs, out of which one represents sense of hearing and another sense of seeing. Out of all the senses, only these two cause serious erosion of moral values. Like swans one should take notice of good things in life. That is why She is referred as swan.

Nāma 816 is muni-mānasa-haṁsikā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 May 2022

No comments:

Post a Comment