🌹 . శ్రీ శివ మహా పురాణము - 566 / Sri Siva Maha Purana - 566 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
🌻. పతివ్రతా ధర్మములు - 4 🌻
స్నానము చేసిన తరువాత భర్త ముఖమునే చూడవలెను. ఇతరుల ముఖమును చూడరాదు. భర్త దగ్గర లేనిచో, భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని చూడవలెను (33). భర్త యొక్క ఆయుష్షును గోరు పతివ్రత పసుపును, కుంకుమను, సిందూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికెను, కేశసంస్కారమును, కేశాభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను, ఇటువంటి ఇతర ఆభరణములను విడనాడరాదు (34, 35). చాకలితో, కులటతో, సన్న్యాసినితో మరియు భాగ్యహీనురాలితో ఎన్నడునూ ఎక్కడనైననూ స్నేహము చేయరాదు (36).
భర్తను ద్వేషించు స్త్రీతో పతివ్రత ఎన్నడునూ సంభాషించరాదు. ఎక్కడైనననూ ఒంటరిగా నుండరాదు. నగ్నముగా ఎన్నడైననూ స్నానము చేయరాదు (37). పతివ్రత రోటిపైన, రోకలిపైన, చీపురు కట్టపైన,రాతిపైన, తిరగలిపైన, గడప పైన ఎన్నడునూ కూర్చుండరాదు (38). సంభోగసమయమునందు తక్క ఇతరత్రా ప్రగల్భముగ నుండరాదు. భర్తకు దేని యందు అభిరుచి గలదో, దానియందామె ప్రేమను కలిగి ఉండవలెను (39). భర్త ఆనందముగ నున్నచో, భార్య ఆనందించవలెను. ప్రియుడగు భర్త విషాదమును పొందినచో ప్రియురాలగు భార్య కూడ విషాదమును పొందవలెను. పతివ్రత సర్వకాలములయందు భర్త యొక్క హితమును గోరవలెను (40).
భార్య సంపద కల్గినపుడు, ఆపద వచ్చినప్పుడు కూడ ఏకరూపముగ పుణ్య భావమును కలిగి యుండవలెను. ఆమె ధైర్యమును కలిగియుండి తనలో ఎట్టి వికారమునకైననూ తావీయరాదు (41). పోపు సామగ్రి, ఉప్పు, నూనె మొదలగునవి లేక పోయిననూ, పతివ్రత భర్తతో 'లేదు' అని చెప్పరాదు. భర్తకు ఆయాసమును కలిగించరాదు (42).
భర్త విష్ణువు కంటె, బ్రహ్మకంటె, శివుని కంటె గొప్పవాడని పెద్దలు చెప్పెదరు. ఓ దేవదేవీ! పతివ్రతకు తన భర్త శివుడే యగును (43). భర్తను కాదని వ్రతములను, ఉపవాసములను, నియమములను అనుష్టించు స్త్రీ భర్త ఆయుష్షును క్షయము చేయుటయే గాక, మరణించిన పిదప నరకమును పొందును (44).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 566 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴
🌻 Description of the duties of the chaste wife - 4 🌻
33. After her bath she shall see her husband’s face and not that of anyone else. Or after thinking on her husband she shall then gaze at the sun.
34-35. If a chaste lady wishes for the longevity of her husband she shall not forsake turmeric, vermilion, saffron, collyrium, a blouse, the betel, the necklace, ornaments, brushing and plaiting the hair bangles and earrings.
36. A chaste woman shall never associate intimately with a washerwoman, a harlot, a female ascetic or a fallen woman.
37. She shall not talk to any woman who disparages or hates her husband. She shall not stand alone anywhere nor shall she take bath in the nude.
38. A chaste lady shall never sleep on a mortar threshing rod, a broom, a grinding stone, a machine or on the threshold.
39. Except at the time of sexual intercourse she shall never show her maturity and initiative. She shall like whatever her husband is interested in.
40. A chaste lady shall be delighted when her husband is delighted and dejected when he is dejected. She shall always wish for his benefit.
41. She shall be virtuous and equanimous in affluence and adversity. She shall have fortitude and shall never go astray.
42. Even when ghee, salt, oil or other things are exhausted she shall not tell her husband openly about it lest he should be subjected to undue strain.
43. O Goddess, the husband is superior to Brahmā, Viṣṇu or Śiva, for a chaste lady her husband is on a par with Śiva.
44. She who transgresses her husband and observes fast and other rites wrecks the longevity of her husband and after death goes to hell.
Continues....
🌹🌹🌹🌹🌹
19 May 2022
No comments:
Post a Comment