శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 373 -2. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻

ఆధునిక కాలమున ప్రాణముండి ప్రజ్ఞ కోల్పోవు వారిని ఆసుపత్రులలో చూడవచ్చును. నెలల తరబడి సంవత్సరముల తరబడి ప్రజ్ఞ కోల్పోయినవారు ప్రాణముతో నుండుట, అటుపైన మరల ప్రజ్ఞ తిరిగి వచ్చి దేహమున మేల్కొనుట కూడ చూచు చున్నాము. ఇటీవలి కాలమున ఈ అంశమునకు నిజమైన ఉదాహరణగ నిలచిన వారు విజయనగరపు రాజగు శ్రీ పి.వి.జి. రాజుగారు. యోగులు ప్రాణమునకు శరీరము నప్పగించి ప్రజ్ఞతో విహారము చేయుదురు. యజ్ఞార్థమై లోకహితము చేయు యోగులు దివ్య ప్రాణమును, దివ్య దేహమును ధరించి నిద్రా సమయమున కర్తవ్యమును నిర్వర్తించి మరల తిరిగి వత్తురు.

ప్రాణము దేహము నందున్నప్పుడు ప్రజ్ఞ తిరిగి వచ్చుట కవకాశమున్నది. ప్రాణము దేహమును విడిచినచో ప్రజ్ఞ దేహమున వుండలేదు. సావిత్రీ ఉపాఖ్యానమున కూడ దీనిని దర్శింప వచ్చును. శ్రీమాత శివుని ప్రాణనాడి యెట్లో అట్లే సావిత్రీదేవి సత్యవంతునికి ప్రాణనాడియై నిలచినది. అది ఆమె ఆరాధనా బలము. కనుకనే సత్యవంతుని మరల కొనివచ్చినది. పతివ్రతా స్త్రీల యందు ఇట్టి శక్తి శ్రీమాతయే. వారి ఆరాధనము కారణముగ వారి భర్తలు క్షేమముగ నుందురు. మాంగల్యము గట్టిదైనచో ఆమె బ్రతికి యుండగ భర్త మరణింపడు. భార్య మాంగల్యము బలమై యుండవలె ననినచో శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించుట సంప్రదాయము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 373-2. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻

Saundarya Laharī (verse 28) also speaks about the importance of Śaktī in sustaining Śiva. Śiva swallowed the dreadful poison that was formed while churning the ocean of milk. It was due to the auspiciousness of Her ear ornaments, Śiva was saved from the disastrous effects of that poison. The point driven home here is that the eternal Śiva cannot function without Śaktī and by the effect of Her māyā the universe exists today. That is why She is called the life energy of Śiva


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 May 2022

No comments:

Post a Comment