🌹 . శ్రీ శివ మహా పురాణము - 568 / Sri Siva Maha Purana - 568 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
🌻. పతివ్రతా ధర్మములు - 6 🌻
పతివ్రత యొక్క తండ్రి వంశములోని ముగ్గురు, తల్లివంశములోని వారు ముగ్గురు, భర్త వంశములోని వారు ముగ్గురు ఆమె పుణ్యముచే స్వర్గములో సౌఖ్యముల ననుభవించెదరు (59). శీలమును విడి చెడు దారులలో తిరిగే స్త్రీల యొక్క పితృమాతృభర్తృ వంశములవారు పతితులగుదురు. అట్టి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందెదు (60).
పతివ్రత యొక్క పాదము ఏయే స్థానములలో భూమిని స్పృశించునో, ఆయా స్థానములు పాపములు తొలగిపావనమగును (61). సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు కూడ తమ పవిత్రత కొరకు పతివ్రతను స్పశించెదరనుటలో సందేహము లేదు (62).
జలములు సర్వదా పతివ్రతల స్పర్శను గోరును. అట్టి స్పర్శను పొంది 'ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పవిత్రులను చేయు సామర్థ్యము లభించినది' అని జలములు భావించును (63). గృహస్థ ధర్మమునకు, గృహస్థుని సుఖమునకు, ధర్మము యొక్క ఫలమును పొందుటకు, సంతానాభివృద్ధికి భార్యయే మూలమై యున్నది (64).
రూప లావణ్యములచే గర్వించిన స్త్రీలు అన్ని గృహములలో లేరా? కాని విశ్వేశ్వరుని యందలి భక్తిచే మాత్రమే పతివ్రతయగు స్త్రీలభించును (65). మానవుడు భార్యా సహాయముతో ఇహపరలోకములను రెండింటినీ జయించును. భార్య లేనివాడు దేవయజ్ఞ పితృయజ్ఞ అతిథియజ్ఞాది కర్మలకు అర్హుడు కాడు (66).
ఎవని గృహములో పతివ్రత ఉండునో వాడే గృహస్థుడని తెలియవలెను. పతివ్రత కాని స్త్రీ పురుషుని రాక్షసి వలె, వార్ధక్యమువలె ప్రతిదినము భక్షించివేయును (67). గంగా స్నానముచే శరీరము పవిత్రమగును. అటులనే పతివ్రతను చూచినంత మాత్రాన సర్వము పవిత్రమగును (68). పతివ్రతయగు స్త్రీకి గంగకు తేడా లేదు. పతివ్రత, ఆమె సాక్షాత్తుగా ఉమాశివులతో సమమైనవారు గనుక, విద్వాంసుడు వారిని పూజించవలెను (69). భర్త ఓంకారము, భార్య వేదము. భర్త తపస్సు, భార్య క్షమ. భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మఫలము. ఓ పార్వతీ! అట్టి దంపతులు ధన్యులు (70).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 568 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴
🌻 Description of the duties of the chaste wife - 6 🌻
59. The three families—that of the father, that of the mother and that of the husband—enjoy the pleasures of heaven due to the merit of the chaste woman.
60. Disloyal women cause the downfall of the three families, that of the father, mother and husband and become distressed here and hereafter.
61. Wherever the chaste lady sets her foot, the sin is dispelled therefrom and the place is sanctified.
62. Even the sun, moon and wind touch the chaste woman to sanctify themselves and not otherwise.
63. Waters desire the touch of the chaste lady thinking—“Now our sluggishness is gone. Now we are able to purify others”.
64. Wife is the root of the household, and of its happiness; she is the source of the fruit of virtue and for the flourishing of the family.
65. In every house there are women proud of their exquisite beauty and comely appearance. But it is only due to the devotion of Śiva that a chaste lady is obtained.
66. The present and the next world can be won through her. A wifeless man is not authorized to perform the rites of gods, Pitṛs guests and sacrifices.
67. He alone is the true householder in whose house there is a chaste lady. The others are devoured by an ogress or old age.
68. Just as the body is purified by a plunge in the Gaṅgā, so everything is sanctified on seeing a chaste woman.
69. A chaste lady is not different from Gaṅgā. She and her husband are like Pārvatī and Śiva. Hence a sensible man shall worship them.
70. The husband is the high tone and the wife is the quarter tone. The husband is austerity and the woman is forbearance. The husband is the fruit and the wife is a sacred rite. O Pārvatī, such a pair is blessed.
Continues....
🌹🌹🌹🌹🌹
23 May 2022
No comments:
Post a Comment