08 - JUNE - 2022 WEDNESDAY MESSAGES బుధవారం, సౌమ్య వాసరే

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 08, బుధవారం, జూన్ 2022 సౌమ్య వాసరే Monday 🌹
2) 🌹 కపిల గీత - 20 / Kapila Gita - 20🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 60 / Agni Maha Purana - 60🌹 
4) 🌹. శివ మహా పురాణము - 576 / Siva Maha Purana - 576🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 195 / Osho Daily Meditations - 195🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య పంచాగము - Daily Panchagam 08, June 2022, శుభ బుధవారం, సౌమ్య వాసరే 🌹*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami 🌺*

*🍀. నారాయణ కవచము - 7 🍀*

*11. ఇత్యాత్మానం పరం ధ్యాయే ద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్ |*
*విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్*
*12. ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రి పద్మః పతగేంద్ర పృష్ఠే |*
*దరారిచర్మాసిగదేషుచాప- పాశాన్దధానోఽష్ట గుణోఽష్టబాహుః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవంతుని పని కొరకు ముందుకు రండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. సద్గురు శ్రీరామశర్మ. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-అష్టమి 08:31:32 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 28:31:36 వరకు
తదుపరి హస్త
యోగం: సిధ్ధి 27:27:17 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బవ 08:28:31 వరకు
వర్జ్యం: 11:14:18 - 12:53:02
దుర్ముహూర్తం: 11:48:51 - 12:41:24
రాహు కాలం: 12:15:08 - 13:53:41
గుళిక కాలం: 10:36:34 - 12:15:08
యమ గండం: 07:19:28 - 08:58:01
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 21:06:42 - 22:45:26
సూర్యోదయం: 05:40:55
సూర్యాస్తమయం: 18:49:20
చంద్రోదయం: 12:53:47
చంద్రాస్తమయం: 00:49:34
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: సింహం
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 28:31:36
వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 20 / Kapila Gita - 20🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. భక్తి - వైరాగ్యాము - 3 🌴*

*20. ప్రసఙ్గమజరం పాశమాత్మనః కవయో విదుః*
*స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతమ్*

*దుర్మార్గల యందు సంబంధము పెంచుకోవడమే పెంచబడిన పాశమని పండితులు చెబుతున్నారు. ఇదే సంబంధాన్ని సజ్జనుల యందు పెట్టుకుంటే అదే మోక్షాన్ని ఇస్తుంది. పైన చెప్పినవేమీ లేకపోయినా అవి ఉన్న వారిని పట్టుకుంటే సులభముగా మోక్షం వస్తుంది. ఏ విషయములతో తగులుకోకుండా మనసు ఉండలేదు. దానినే సంగం అంటారు. అందుకే సంగాన్ని విడిచి పెట్టాలనుకున్నా విడిచిపెట్టలేము. అందుకే సత్సంగము చేయమని చెబుతుంది శాస్త్రం. సజ్జనుల యందు, సద్విషయముల యందు మనసు లగ్నం చేస్తే మోక్ష ద్వారం తెరుచుకుంటుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 20 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Spiritual Attachment and Material Detachment - 3 🌴*

*20. prasangam ajaram pasam atmanah kavayo viduh*
*sa eva sadhusu krto moksa-dvaram apavrtam*

*Every learned man knows very well that attachment for the material is the greatest entanglement of the spirit soul. But that same attachment, when applied to self-realized devotees, opens the door of liberation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 576 / Sri Siva Maha Purana - 576 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*

*🌻. శివ విహారము - 3 🌻*

దేవతలిట్లు పలికిరి--

యోగిశ్రేష్ఠుడు, వికారములు లేనివాడు,ఆత్మారాముడు, కర్మఫల లేపము లేనివాడు అగు శంభుప్రభుడు మన కార్యము కొరకై వివాహమాడినాడు (19).ఆయనకు ఇంకనూ కుమారుడు కలుగలేదు. దానికి కారణము తెలియకున్నది. దేవదేవుడగు శివుడు ఇట్లు ఆలస్యము చేయుటకు కారణమేమి? (20) 

ఇంతలో దేవతలకు నేత్రము వంటి నారదుని వలన దేవతలు పార్వతీ పరమేశ్వరుల వేయి దివ్య సంవత్సరముల ఏకాంత విహారమును గూర్చి తెలుసుకొనిరి(21). ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరుల విహారములో చిరకాలము గడిచి పోవుటను గాంచి, చింతిల్లినవారై, బ్రహ్మనగు నన్ను ముందిడుకొని, నారాయణుని వద్దకు వెళ్లిరి(22).

నేను ఆయనకు నమస్కరించి స్వేచ్ఛగా జరిగిన వృత్తాంతమును నివేదించితిని. దేవతందరు చిత్రపటమునందలి బొమ్మలవలె నిశ్చేష్టులై ఉండిరి (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంకరుడు దేవమానముచే వేయి సంవత్సరముల నుండి రమించు చున్నాడు. కాని ఆ యోగి విరమించుట లేదు. దేవకార్యమును చేయుట లేదు (24).

విష్ణు భగవానుడిట్లు పలికెను-

ఓ జగత్తును సృష్టించిన బ్రహ్మా! చింతిల్లకుము. సర్వము మంగళము కాగలదు. దేవ దేవుడు, మహాప్రభుడు అగు శంకరుని శరణు వేడుము (25). ఓ బ్రహ్మా! ఏ జనులైతే మనస్సులో ఆనందముతో మహేశ్వరుని శరణు పొందెదరో, అట్టి భక్తులకు ఎక్కడనైననూ దేవి నుండియైననూ భయము ఉండదు (26).

ఓ బ్రహ్మా! విహారము ఇప్పుడు పూర్తి కాదు. సమయము వచ్చినప్పుడు కాగలదు. కార్యము సమయము వచ్చినప్పుడు మాత్రమే సిద్ధించును. కార్యసిద్ధికి మరియొక మార్గము లేదు (27). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 576 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 The dalliance of Śiva - 3 🌻*

The gods said:—
19. It is for the fulfilment of our task that Lord Śiva, the leader of Yogins, free from aberrations, the unsullied, revelling and resting in his own Self, has married.

20. No son is born to Him. We do not know the reason. How is it that the lord of gods is delaying the action?

Brahmā said:—
21. In the meantime, from Nārada who has the divine vision the gods came to know of the extent of the enjoyment of the couple engaged in dalliance.

22. Realising that their enjoyment had extended over a long time, the gods became worried. Making me Brahmā as their leader they approached Viṣṇu Nārāyaṇa[4].

23. After bowing to him I narrated to him all the details we desired to convey. The gods stood steady and silent like dolls painted in a picture.

24. For a thousand years according to the calculation of the gods, Śiva the Yogin has been engaged in sexual dalliance. He does not desist from it.

Lord Viṣṇu said:—
25. O creator of the universe, there is nothing to worry about. Everything will be well. O lord of gods, seek refuge in the great lord Śiva.

26. O lord of subjects, the people who dedicate their minds to and seek refuge in Him joyously and devoutly have nothing to fear from any quarter.

27. The interruption to amorous dalliance will take place at the proper time, not now, O Brahmā. Any task carried out at the proper time shall be crowned with success, not otherwise.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 60 / Agni Maha Purana - 60 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 23*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి -1‌ 🌻*

నారదుడు పలికెను.

విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమునుధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను 1,2

హృదయపద్మ మధ్యమునం దున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను. 

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. దాని నుండి స్రవించు చున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారల చేత తన దేహమును నింపవలెను 4, 5

శోధనము చేసి తత్త్వనా నము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. 6

దేహము నందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 60 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 23*
*🌻 Mode of performing worship - 1🌻*

Nārada said:

1-2. I will now describe the mode of worship, O brahmins! by doing which one gets all (objects of life). Having washed feet, sipping waters, and controlling his speech and having guarded (himself like this), facing the east, and having seated in the svastika or padmāsana or other posture (one has to meditate) on (the syllable) yam at the centre of the navel, having tawny colour and of the form of terrible wind.

3. Then meditating on the syllable kṣaum of abundant lustre at the centre of the heart, burn down all impurities from the body.

4-5. One has to burn the impurities with the flames surging upwards and downwards. One has to meditate on the (mantra) of the shape of the moon situated in the sky. An intelligent person has to sprinkle his own body with the nectar-like waters pervading the lotus in the heart through (the artery) suṣumnā and passing through the nerves.

6. Having purified materials (for worship) one has to assign (them). Then (one has) to purify hands as well as implements. Commencing with the thumb of the right hand, (the fingers) of the two hands are made to rest on the principal limbs.

7-8. (Then) with sixty-two mantras (sacred syllables) one has to assign to the body the twelve limbs—heart, head, tuft of hair, armour, weapons, eyes, belly, hinder part, arms, thighs, knees and feet. Having offered the mudrā (special posture of the arms and body), one has to meditate on Viṣṇu, and having repeated (his name) one hundred and eight times, one has to worship him.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 195 / Osho Daily Meditations - 195 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 195. శాశ్వతత్వం 🍀*

*🕉. కాలం ఎప్పటికీ ఉన్నా శాశ్వతత్వం అనేది దానిలోని కొనసాగింపు కాదు. నిఘంటువులలోని అర్థం: ఎప్పటికీ మరియు ఎప్పటికీ. కాలం నిరవధికంగా దీర్ఘకాలం ఉన్నప్పటికి శాశ్వతత్వం అనేది దానిలో భాగమైతే కూడా అది అశాశ్వతమైన సమయమే. శాశ్వతత్వం అనేది కాలాతీత స్థితి. అంటే కాలం నుండి బయటకు దుంకడము. ఇది తాత్కాలికం కాదు, ఇది సమయం కాదు. 🕉*
 
*ప్రస్తుత క్షణం శాశ్వతత్వానికి తలుపు. గతం మరియు భవిష్యత్తు సమయం యొక్క భాగం. వర్తమానం సమయం యొక్క భాగం కాదు - వర్తమానం కేవలం రెండింటి మధ్య, గతం మరియు భవిష్యత్తు మధ్య ఉంటుంది. మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నట్లయితే, అప్పుడు మాత్రమే మీరు వర్తమానంలో ఉంటారు; లేకపోతే మీరు దానిని కోల్పోతారు. మీరు అప్రమత్తంగా లేకుంటే, మీరు అప్రమత్తంగా ఉన్న సమయానికి అది ఇప్పటికే పోయింది, ఇది గతంగా మారింది; అది చాలా వేగంగా ఉంది. కాబట్టి గతం మరియు భవిష్యత్తు మధ్య ఒక తలుపు, అంతరం, విరామం-ఇప్పుడు-అదే శాశ్వతత్వానికి తలుపు. శాశ్వతత్వంలో మాత్రమే ఆనందం సాధ్యమవుతుంది: సమయానికి గరిష్టంగా ఆనందం; చెత్తగా నొప్పి - కానీ రెండూ నశ్వరమైనవి. వారి స్వభావం భిన్నంగా లేదు. నొప్పి వస్తుంది మరియు పోతుంది, ఆనందం వస్తుంది మరియు పోతుంది. అవి క్షణికమైనవి, నీటి బుడగలు.*

*ఆనందానికి ప్రతిరూపం లేదు. ఇది పగలు మరియు రాత్రి అనే ద్వంద్వ ఆనందం మరియు బాధ కాదు. ఇది ద్వందాతీతము. దీనికి వ్యతిరేకం తెలియదు. ఇది పరమార్థం. వర్తమానంలో మరింత ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించండి. ఊహలోనూ, జ్ఞాపకశక్తిలోనూ ఎక్కువగా కదలకండి. ఎప్పుడైతే మీరు స్మృతిలో, - ఊహల్లో తిరుగుతున్నారో, మిమ్మల్ని మీరు వర్తమానానికి అంటే మీరు ఏమి చేస్తున్నారో, మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎవరు అనే దానికి తిరిగి తీసుకురండి. మిమ్మల్ని మళ్లీ మళ్లీ వర్తమానానికి లాగండి. బుద్ధుడు తనను తాను గుర్తుచేసుకోవడం అని పిలిచాడు; ఆ స్మరణలో శాశ్వతత్వం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 195 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 195. ETERNITY 🍀*

*🕉 Eternity is not the continuity if time forever. That is the meaning in the dictionaries :forever and forever. But forever is part if time -- prolonged time, indefinitely prolonged, but it is still time. Eternity is jumping out if time; it is nontemporal, it is no-time. 🕉*
 
*The present moment is the door to eternity. The past and future are part of time. The present is not part of time-the present is just between the two, between the past and the future. If you are absolutely alert, only then are you in the present; otherwise you keep missing it. If you are not alert, by the time you are alert it is already gone, it has become the past; it is so swift. So between the past and the future there is a door, a gap, an interval-now-that is the door to eternity. Only in eternity is bliss possible: in time, at the most, pleasure; at worst, pain-but both are fleeting. Their nature is not different. Pain comes and goes, pleasure comes and goes. They are momentary, water bubbles.*

*Bliss has no counterpart. It is not a duality of pleasure and pain, day and night. It is nondual, it knows no opposite. It is a transcendence. Try to be more and more in the present. Don't move too much in imagination and memory. Whenever you find yourself wandering into memory, - into imagination, bring yourself back to the present, to what you are doing, to where you are, to who you are. Pull yourself back again and again to the present. Buddha has called it recollecting oneself; in that recollection by and by you will understand what eternity is.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 378-1. 'జాలంధర స్థితా’ 🌻* 

*జాలంధర మను పీఠము నందు ఉండునది శ్రీమాత అని అర్థము. శ్రీదేవి జలంధర మను పీఠమును విష్ణుముఖి అను పేరుతో పూజింపబడు చున్నట్లుగా పద్మ పురాణమున పేర్కొనబడినది. జాలంధర మనగా ఇంద్రజాల మహేంద్రజాలములతో కూడిన మంద్రజాలము. మంద్రజాల మనగా చైతన్యమునుండి ఏర్పడిన లోకాలోకముల వల లేక శ్రీదేవి మాయావరణములు. సృష్టి యందు విష్ణువు మాయావి అని ప్రసిద్ధి గాంచెను. శ్రీమాతయే శ్రీమహావిష్ణువు. అందువలన ఆమె 'విష్ణుముఖి' అని పిలువబడుచున్నది. దుష్టులకు మాయ కలిగించుట, శిష్టులకు మాయ తొలగించుట శ్రీమాత జాలము.*

*అట్టి జాలమును ధరించి యుండును గనుక 'జాలంధరి' అని ప్రసిద్ధి గాంచినది. లీలాప్రాయముగ తన జాలమును ప్రయోగించుట, మరల తొలగించుట చేయుచు నుండును. త్రిమూర్తులు సహితము ఆమె సృష్టి జాలమును అవగాహన చేసికొనలేరు. కేవలము పరతత్త్వమునకే అవగాహన యగును. శ్రీదేవి మాయాజాలముతో గూడిన అసురు డొక డుండె నని, అతని పేరు జలంధరు డని, ఆ జలంధరుడు ఇంద్రుని, విష్ణువుని కూడ తన జాలముతో జయించి బంధించె నని, అటుపైన పరమశివుడు అతనిని జయించి విష్ణుని, ఇంద్రుని రక్షించే నని పద్మపురాణము పేర్కొనుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 378 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 378. Jālandhara-sthitā जालन्धरा-स्थिता 🌻*

*A reference is invited to jālandhara pīṭha or the heart cakra, where the sound is further refined, to become madhyama, the penultimate stage of sound before its actual delivery. This is one of Her Śabda Brahman forms.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment