🌹 . శ్రీ శివ మహా పురాణము - 576 / Sri Siva Maha Purana - 576 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴
🌻. శివ విహారము - 3 🌻
దేవతలిట్లు పలికిరి--
యోగిశ్రేష్ఠుడు, వికారములు లేనివాడు,ఆత్మారాముడు, కర్మఫల లేపము లేనివాడు అగు శంభుప్రభుడు మన కార్యము కొరకై వివాహమాడినాడు (19).ఆయనకు ఇంకనూ కుమారుడు కలుగలేదు. దానికి కారణము తెలియకున్నది. దేవదేవుడగు శివుడు ఇట్లు ఆలస్యము చేయుటకు కారణమేమి? (20)
ఇంతలో దేవతలకు నేత్రము వంటి నారదుని వలన దేవతలు పార్వతీ పరమేశ్వరుల వేయి దివ్య సంవత్సరముల ఏకాంత విహారమును గూర్చి తెలుసుకొనిరి(21). ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరుల విహారములో చిరకాలము గడిచి పోవుటను గాంచి, చింతిల్లినవారై, బ్రహ్మనగు నన్ను ముందిడుకొని, నారాయణుని వద్దకు వెళ్లిరి(22).
నేను ఆయనకు నమస్కరించి స్వేచ్ఛగా జరిగిన వృత్తాంతమును నివేదించితిని. దేవతందరు చిత్రపటమునందలి బొమ్మలవలె నిశ్చేష్టులై ఉండిరి (23).
బ్రహ్మ ఇట్లు పలికెను-
శంకరుడు దేవమానముచే వేయి సంవత్సరముల నుండి రమించు చున్నాడు. కాని ఆ యోగి విరమించుట లేదు. దేవకార్యమును చేయుట లేదు (24).
విష్ణు భగవానుడిట్లు పలికెను-
ఓ జగత్తును సృష్టించిన బ్రహ్మా! చింతిల్లకుము. సర్వము మంగళము కాగలదు. దేవ దేవుడు, మహాప్రభుడు అగు శంకరుని శరణు వేడుము (25). ఓ బ్రహ్మా! ఏ జనులైతే మనస్సులో ఆనందముతో మహేశ్వరుని శరణు పొందెదరో, అట్టి భక్తులకు ఎక్కడనైననూ దేవి నుండియైననూ భయము ఉండదు (26).
ఓ బ్రహ్మా! విహారము ఇప్పుడు పూర్తి కాదు. సమయము వచ్చినప్పుడు కాగలదు. కార్యము సమయము వచ్చినప్పుడు మాత్రమే సిద్ధించును. కార్యసిద్ధికి మరియొక మార్గము లేదు (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 576 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴
🌻 The dalliance of Śiva - 3 🌻
The gods said:—
19. It is for the fulfilment of our task that Lord Śiva, the leader of Yogins, free from aberrations, the unsullied, revelling and resting in his own Self, has married.
20. No son is born to Him. We do not know the reason. How is it that the lord of gods is delaying the action?
Brahmā said:—
21. In the meantime, from Nārada who has the divine vision the gods came to know of the extent of the enjoyment of the couple engaged in dalliance.
22. Realising that their enjoyment had extended over a long time, the gods became worried. Making me Brahmā as their leader they approached Viṣṇu Nārāyaṇa[4].
23. After bowing to him I narrated to him all the details we desired to convey. The gods stood steady and silent like dolls painted in a picture.
24. For a thousand years according to the calculation of the gods, Śiva the Yogin has been engaged in sexual dalliance. He does not desist from it.
Lord Viṣṇu said:—
25. O creator of the universe, there is nothing to worry about. Everything will be well. O lord of gods, seek refuge in the great lord Śiva.
26. O lord of subjects, the people who dedicate their minds to and seek refuge in Him joyously and devoutly have nothing to fear from any quarter.
27. The interruption to amorous dalliance will take place at the proper time, not now, O Brahmā. Any task carried out at the proper time shall be crowned with success, not otherwise.
Continues....
🌹🌹🌹🌹🌹
08 Jun 2022
No comments:
Post a Comment