16 - JUNE - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసరే

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, గురువారం, జూన్ 2022 బృహస్పతి వాసరే Thursday 🌹
2) 🌹 కపిల గీత - 24 / Kapila Gita - 24🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 64 / Agni Maha Purana - 64🌹 
4) 🌹. శివ మహా పురాణము - 580 / Siva Maha Purana - 580🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 199 / Osho Daily Meditations - 199🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.16, June 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, THURSDAY*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 9 🍀*

*భూరంభాస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్*
*ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్*
*నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే*

*తాత్పర్యము: ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక శక్తి చేతనలోని సృజనాత్మకతకు ఆసరా, బలమునిచ్చి, సహాయం చేసే ఆలోచనలను నిలపి కార్యములను చేయగల సామర్థ్యం కలిగిస్తుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ విదియ 09:46:59 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: పూర్వాషాఢ 12:38:14 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: బ్రహ్మ 21:08:24 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: గార 09:46:59 వరకు
వర్జ్యం: 19:44:00 - 21:09:12
దుర్ముహూర్తం: 10:05:05 - 10:57:45
మరియు 15:21:04 - 16:13:44
రాహు కాలం: 13:55:29 - 15:34:14
గుళిక కాలం: 08:59:15 - 10:38:00
యమ గండం: 05:41:46 - 07:20:30
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 08:25:00 - 09:49:20
మరియు 28:15:12 - 29:40:24
సూర్యోదయం: 05:41:46
సూర్యాస్తమయం: 18:51:43
చంద్రోదయం: 21:08:16
చంద్రాస్తమయం: 07:20:20
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ధాత్రి యోగం - కార్య జయం 12:38:14
వరకు తదుపరి సౌమ్య యోగం -
సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 24 / Kapila Gita - 24🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. సాధువు లక్షణములు - 4 🌴*

*24. త ఏతే సాధవః సాధ్వి సర్వసఙ్గ వివర్జితాః*
*సఙ్గస్తేష్వథ తే ప్రార్థ్యః సఙ్గదోషహరా హి తే*

*ఇలాంటి వారు సాధువులు. అన్ని రకముల సంగతినీ విడిచిపెడతారు. అలాంటి వారి విషయములో నీ మనసు సంగతి పొందాలని ప్రార్థించు. భగావంతుని మనం అడగాల్సినది ఇదొక్కటే. దుష్ట సంగం వలన కలిగిన పాపాన్ని ఈ సత్సంగం తొలగిస్తుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 24 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 The Symptoms of a Sadhu - 4 🌴*

*24. ta ete sadhavah sadhvi sarva-sanga-vivarjtah*
*sangas tesv atha te prarthyah sanga-dosa-hara hi te*

*O My mother, O virtuous lady, these are the qualities of great devotees who are free from all attachment. You must seek attachment to such holy men, for this counteracts the pernicious effects of material attachment.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 580 / Sri Siva Maha Purana - 580 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴*

*🌻. శివ విహారము - 7 🌻*

ఓ మునిశ్రేష్ఠా! విష్ణువు నాతో దేవతలతో కలిసి అచట నిలబడి సర్వలోకములకు ప్రభువగు శివుని మహానందముతో స్తుతించెను (58).

విష్ణువు ఇట్లు పలికెను--

మహా దేవా! పరమేశ్వరా! లోపల ఏమి చేయుచున్నావు? తారకాసురునిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలనందరినీ రక్షించుము (59). 

ఓ మునీశ్వరా! విష్ణువు నాతో దేవతలతో గూడి ఈ తీరున శంభుని పరి పరి విధముల స్తుతిస్తూ తారకునిచే పీడింపబడిన దేవతలతో సహా బిగ్గరగా రోదించెను (60). ఓ మునీశ్వరా! అచట రాక్షస పీడితులైన దేవతల దుఃఖము శివుని స్తుతితో మిళితమై కోలాహల మేర్పడెను (61).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివవిహార వర్ణన మనే మొదటి అధ్యాయము ముగిసినది (1). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 580 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 The dalliance of Śiva - 7 🌻*

Brahmā said:—
58. On hearing their words, O excellent sage, Viṣṇu, the gods and I were perplexed and went to the doorway of Śiva’s apartment.

59. After going there along with me and the gods, Viṣṇu, the favourite deity of the gods, spoke in dejection but with joy in the heart.

60. O excellent sage, standing there, along with me and the gods, he eulogised Śiva, the lord of all the worlds with great pleasure.

Viṣṇu said:—
61. O great lord, what are you doing there inside? Save us who are harassed by Tāraka and who have sought refuge in you.

62. O great sage, praising and pleading like this to Śiva, Viṣṇu wept bitterly along with the gods harassed by Tāraka.

63. O great sage, the tumultuous cry of the heaven-dwellers distressed by the demon got mingled with the sound of eulogy to Śiva.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 64 / Agni Maha Purana - 64 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 24*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -2‌ 🌻*

హోమము చేయుటకై చేయు ప్రమాణము లేదు పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకార మైనగర్తము (గొయ్యి) ఉండవలెను. 

అడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవ వంతు అంగుళమును మిగిలిన అర్ధములో అర్థమును కూడ శోధించవలెను. మిగిలిని అర్ధముచే గుర్తమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను. 

త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయతు మైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. దాని ఆయామము కూడా అంతయే ఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము ( స్రుక్కు/ముఖము) అభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.

స్రువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎంట్లుండులో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.

అగ్నికుండమును అలికి, అంగుళముప్రమాణము గల వజ్రనాసికాలేఖను గీయవలెను. అది ఉత్తరాగ్ర మగు మొదటి రేఖ. దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.

మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించును నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతి యాగు వైష్ణవీశక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను. 20

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 64 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 24*
*🌻 Mode of constructing the sacrificial pit and the oblations unto fire - 2🌻*

10. (In pits of) circular (shape) the girdles would be of the shape of the petals of a lotus. The ladle for the sake of oblation is to be made of the size of an arm.

11. Then one has to make (ready) a site (of the length) of thirteen thumbs and four (in breadth). A pit of three-fourths (of the site) is dug and a beautiful circle (is made).

12-13. One has to purify (the space) outside the pit evenly, horizontally and upwards (to the extent of) half a thumb (and) one-fourth of a thumb. A beautiful boundary line is to be made with the remaining (space) (around) the pit.

14-15. Or it may be half a thumb more. The mouth would be at the front (having) a width of four or five thumbs. Its central part might be three times two thumbs and beautiful. The extent (on all sides) (might be) of equal (measurement) (and) its central portion is lowered.

16. There must be a hole at the neck portion (of such a size) that the little finger would enter. The other pit should be beautifully made according to one’s liking.

17. The (sacrificial) ladle should have a handle of the length of one hand. A beautiful spoon (having) circumference of two thumbs has to be made.

18-19. Just as the cow’s foot (would) sink in a little mud, so also after having drawn a line (of the length) of a thumb.(known as) vajranāsikā, (one has to draw) first a line with a fine tip, (then) two lines between it and the east (and) then three lines in the middle from the south onwards in order.

20. Having drawn (the lines), (and) consecrating, with the syllable Om, one who knows the mantras, has to make a seat in which the energy of Viṣṇu rests.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 199 / Osho Daily Meditations - 199 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 199. సత్యము 🍀*

*🕉. అవగాహన ద్వారానే సత్యం సాధించబడుతుంది. ఇది అస్సలు మనస్సు ప్రక్రియ కాదు. మీరు సత్యాన్ని ఆలోచించ కూడదు; బదులుగా, మీరు సత్యం తెలుసుకోవాలంటే అన్ని ఆలోచనలను ఆపాలి; సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీరు సత్యాన్ని మరచిపోయారు. 🕉*
 
*మీరు నేర్చుకున్న సిద్ధాంతాలు, పరికల్పనలు, తత్వాలు మరియు సిద్ధాంతాలన్నింటినీ మీరు విప్పుకోవాలి. సత్యాన్ని సాధించే ప్రక్రియ నేర్చుకునే ప్రక్రియ, ఇది షరతులు లేని ప్రక్రియ. మెల్లగా, మనసులోంచి బయటపడాలి, మనసులోంచి జారిపోవాలి; మరియు ఒకరు కేవలం స్పృహ యొక్క కొలనుగా, స్వచ్ఛమైన అవగాహనగా మారాలి. కేవలం నిష్కపటమైన జాగరూకత: ఏమీ చేయకండి, కేవలం చూడండి, బయటి ప్రపంచంలో మరియు అంతర్గత ప్రపంచంలో జరుగుతున్నదంతా చూడండి.*

*ఎలాంటి తీర్పులతో జోక్యం చేసుకోకుండా, పాత ఆలోచనలు రాకుండా చూడగలిగినప్పుడు, సత్యం తెలుస్తుంది. అద్భుతం ఏమిటంటే అది మీకు ఎక్కడి నుండి రాదు, అది పై నుండి దిగదు; ఇది మీలో కనిపిస్తుంది - ఇది మీ అంతర్గత స్వభావం. సత్యాన్ని తెలుసుకోవడం నిజంగా గొప్ప స్వీయ ఆవిష్కరణ. ఎందుకంటే మీరు అదే మరియు మీరు దానిని ఎన్నడూ కోల్పోలేదు - ఒక్క క్షణం కూడా. మీరు ఎల్లప్పుడూ అలాగే ఉన్నారు. దానిని కోల్పోవడం అసాధ్యం, ఎందుకంటే ఇది మీ స్వభావం మరియు మీ స్వభావం కోల్పోకూడదు. అందుకే ప్రకృతి అని అంటాం. పోగొట్టుకోలేనిది అని ప్రకృతికి నిర్వచనం. పోగొట్టుకునేది ప్రకృతి కాదు, పోషణ. సత్యం మీ ప్రకృతి, మీ స్వభావం, మీ ఉనికి, మీ కేంద్రం.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 199 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 199. TRUTH 🍀*

*🕉 Truth is achieved only through awareness. It is not a mind process at all. You are not to think the truth; rather, you have to stop all thinking to know truth; you have forget all about truth to know truth. 🕉*
 
*You have to unburden yourself of all the theories, hypothesizes, philosophies, and ideologies that you have learned. The process of achieving the truth is a process of unlearning, it is a process of unconditioning. Slowly, one has to get out of the mind, to slip out of the mind; and one has to become just a pool of consciousness, a pure awareness. Just a sheer watchfulness: Do nothing, just watch, watch all that is happening in the outside world and in the inside world.*

*When one can just watch without any judgment interfering, without any old ideas coming in, then truth is revealed. And the miracle is that it does not come from somewhere else to you, it does not descend from above; it is found within you-it is your intrinsic nature. It is really a great revelation to know truth, because you are it and you have never lost it--even for a single moment. You have always been it. It is impossible to lose it, because it is your nature and your nature cannot be lost. That's why we call it nature. That which cannot be lost is the very definition of nature. That which can be lost is not nature but nurture. Truth is your nature, your very being, your very existence, your very center.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*
*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 380. 'బిందుమండలవాసినీ' - 1🌻* 

*బ్రహ్మరంధ్రమున నివసించునది శ్రీమాత అని అర్ధము. బ్రహ్మరంధ్రమును 'బిందు మండల' మందురు. ఆత్మబిందువు వసించు స్థానము బ్రహ్మరంధ్రము. అందువలన 'బిందు మండల వాసిని' అని శ్రీమాతను సంబోధింతురు. ఈ నివాసము సర్వానంద మయము. ఋషులు అంతర్ముఖముగ తపస్సు సాగించి బ్రహ్మరంధ్రము నందు బిందు స్థానమును చేరి తన్మయులై పరవశింతురు. శరీర మొక పద్మకోశము. అనేకానేక పొరలతో ఏర్పడి యున్నది.*

*అన్ని పొరలకు మూలమైన ఆత్మ ప్రజ్ఞ సూర్యప్రభలతో వెలుగుచుండు బిందువువలె యుండును. మంత్రపుష్పమున ఈ బిందువునే ఆరాధించుట జరుగును. ఈ బిందువును బియ్యపు గింజ తలయందలి కొనతో పోల్చి చెప్పుదురు. అందుండియే స్వరాట్, త్రిమూర్తులు మొదలగు ప్రజ్ఞలన్నీ పుట్టినట్లుగ కూడ మంత్రపుష్పము కీర్తించును. బ్రహ్మము వసించు నాళము గనుక బ్రహ్మనాళ మని బ్రహ్మరంధ్ర మని అందురు. ఈ నాళము నుండి వికసించిన పద్మమునందే సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 380 - 1🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*
*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*

*🌻 380. Bindumaṇḍala-vāsini बिन्दुमण्डल-वासिनि - 1 🌻*

*She dwells in the bindu maṇḍala. The bindu is the central dot of Śrī Cakra where She resides along with Her consort Kāmeśvara. This point of Śrī Cakra is considered as the most powerful point because it is the abode of both Kāmeśvara and Kāmeśvarī.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment