నిర్మల ధ్యానాలు - ఓషో - 189
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 189 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు. హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచి పోయాం. 🍀
ప్రతి మనిషి ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాడు. తను ఎక్కడి నించో వచ్చేసినట్లు భావిస్తాడు. అది అతనికి స్పష్టం కాదు. కానీ ప్రతి మనిషి అట్లా భావిస్తాడు. అస్పష్టంగా వూహిస్తాడు. నేను సరైన స్థలంలో లేను. నేను సరయిన పరిస్థితిలో లేను. యిక్కడ వుండాల్సింది కాదు. 'ఏదో పొరపాటు జరిగింది' అనుకుంటాడు. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు.
హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచిపోయాం. దాన్ని నిర్లక్ష్యం చేశాం. మనం తలకు అతుక్కుపోయాం. మనం మరీ ఎక్కువగా జ్ఞానానికి అతుక్కుపోయాం. అస్తిత్వంలో ఎదగడం బదులు, అస్తితవ్వంతో పుష్పించడం బదులు, మనం కేవలం సమాచారాన్ని పోగు చేసుకుంటున్నాం. పనికి మాలిన సమాచార సేకరణలో వున్నాం. హృదయం స్వర్గం. నా ప్రయత్నమంతా మీరు స్వర్గంలో అడుగుపెట్టడానికి సాయపడడం. ఒకసారి మీరు దానిలో అడుగుపెడితే, అనుభవం పొందితే మీరు రూపాంతరం చెందుతారు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment