03 - JUNE - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 03, జూన్ 2022 శుుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 - 5- 07 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 610 / Vishnu Sahasranama Contemplation - 610🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 289 / DAILY WISDOM - 289🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 189 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 03, జూన్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻*

*🍀. 8. ధనలక్ష్మి స్త్రోత్రం 🍀*

*ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే*
*ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |*
*వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే*
*జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : హనుమంతుని వలె కాలనేమిని జయించినప్పుడే భూమిపై సర్గావతరణ అనే గురుకార్యం సాధ్యపడుతుంది.- మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల చవితి 26:43:46 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పునర్వసు 19:05:55 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వృధ్ధి 27:33:17 వరకు
తదుపరి ధృవ
కరణం: వణిజ 13:30:08 వరకు
వర్జ్యం: 05:35:30 - 07:23:26
మరియు 28:01:40 - 29:49:00
దుర్ముహూర్తం: 08:18:12 - 09:10:39
మరియు 12:40:28 - 13:32:56
రాహు కాలం: 10:35:53 - 12:14:15
గుళిక కాలం: 07:19:11 - 08:57:32
యమ గండం: 15:30:57 - 17:09:18
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 16:23:06 - 18:11:02
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:47:40
చంద్రోదయం: 08:34:35
చంద్రాస్తమయం: 22:09:55
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
లంబ యోగం - చికాకులు, అపశకునం
19:05:55 వరకు తదుపరి ఉత్పాద 
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 211 / Bhagavad-Gita - 211 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 07 🌴*

*07. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియ: |*
*సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||*

🌷. తాత్పర్యం :
*భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.*

🌷. భాష్యము :
కృష్ణభక్తి భావన ద్వారా ముక్తి మార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమప్రియుడై యుండును మరియు సర్వజీవులు అతనికి ప్రియులై యుందురు. అతని కృష్ణభక్తి భావనమే అందులకు కారణము. పత్రములు, కొమ్మలు వంటివి వృక్షము నుండి వేరు కానట్లుగా, ఏ జీవియు కృష్ణుని నుండి వేరు కాదని అట్టి భక్తుడు భావించును. వృక్షపు మొదలుకు నీరుపోయుట ద్వారా ఆకులు మరియు కొమ్మలన్నింటికిని నీరు సరఫార యగుననియు లేదా ఉదరమునకు ఆహారము నందించుట ద్వారా దేహమంతయు అప్రయత్నముగా శక్తిని పొందుననియు అతడు ఎరిగియుండును. కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించువాడు సర్వులకు దాసుని వలె వర్తించును కావున సర్వులకు ప్రియుడై యుండును. 

“అట్టి యెడ అర్జునుడు ఏ విధముగా యుద్దరంగమున ఇతరులకు అపకారము చేసెను? అతడు కృష్ణభక్తిపూర్ణుడు కాడా?” అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. కాని వాస్తవమునకు ఆత్మ చంపబడని కారణముగా యుద్ధరంగమునందు నిలిచినవారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపములో నిలువనున్నందున (ద్వితీయాధ్యాయమున ఇది వరకే తెలుపబడినట్లు) అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే అయియున్నది. అనగా ఆధ్యాత్మికదృష్టిలో కురుక్షేత్రమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్న శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞ మేరకు వారు దుస్తులవంటి దేహములు మాత్రమే మార్చబడినవి. 

అనగా అర్జునుడు కురుక్షేత్రరణరంగమున యుద్ధము చేసినను కేవలము శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞలను సంపూర్ణభక్తిభావనలో నిర్వర్తింపజేసి యున్నందున నిజముగా యుద్ధము చేయనివాడే అయినాడు. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 211 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 07 🌴*

*07. yoga-yukto viśuddhātmā vijitātmā jitendriyaḥ*
*sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate*

🌷 Translation : 
*One who works in devotion, who is a pure soul, and who controls his mind and senses is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled.*

🌹 Purport :
One who is on the path of liberation by Kṛṣṇa consciousness is very dear to every living being, and every living being is dear to him. This is due to his Kṛṣṇa consciousness. Such a person cannot think of any living being as separate from Kṛṣṇa, just as the leaves and branches of a tree are not separate from the tree. He knows very well that by pouring water on the root of the tree, the water will be distributed to all the leaves and branches, or by supplying food to the stomach, the energy is automatically distributed throughout the body. 

One may ask, “Why then was Arjuna offensive (in battle) to others? Wasn’t he in Kṛṣṇa consciousness?” Arjuna was only superficially offensive because (as has already been explained in the Second Chapter) all the assembled persons on the battlefield would continue to live individually, as the soul cannot be slain. So, spiritually, no one was killed on the Battlefield of Kurukṣetra. Only their dresses were changed by the order of Kṛṣṇa, who was personally present. 

Therefore Arjuna, while fighting on the Battlefield of Kurukṣetra, was not really fighting at all; he was simply carrying out the orders of Kṛṣṇa in full Kṛṣṇa consciousness. Such a person is never entangled in the reactions of work.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 610 / Vishnu Sahasranama Contemplation - 610🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻610. శ్రీధరః, श्रीधरः, Śrīdharaḥ🌻*

*ఓం శ్రీధరాయ నమః | ॐ श्रीधराय नमः | OM Śrīdharāya namaḥ*

*జననీం సర్వభూతానాం వహన్ స్వే వక్షసి శ్రియమ్ ।*
*మహావిష్ణుః శ్రీధరః ఇత్యుచ్యతే పరమేశ్వరః ॥*

*సర్వ జీవ జననియగు శ్రీని తన వక్షము నందు ధరించును గనుక శ్రీ విష్ణుదేవునకు శ్రీధరః అని నామము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 610🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻610. Śrīdharaḥ🌻*

*OM Śrīdharāya namaḥ*

जननीं सर्वभूतानां वहन् स्वे वक्षसि श्रियम् ।
महाविष्णुः श्रीधरः इत्युच्यते परमेश्वरः ॥

*Jananīṃ sarvabhūtānāṃ vahan sve vakṣasi śriyam,*
*Mahāviṣṇuḥ śrīdharaḥ ityucyate parameśvaraḥ.*

*Since He bears on His bossom, Śrī who is the mother of all creatures, Lord Viṣṇu has the divine name 'Śrīdharaḥ'.*

:: श्रीमद्बागवते द्वादशस्कन्धे द्वादशोऽध्यायः ::
यशः श्रियामेव परिश्रमः परो वर्णाश्रमाचारतपः श्रुतादिषु ।
अविस्मृतिः श्रीधरपादपद्मयोर्गुणानुवादश्रवणादरादिभिः ॥ ५४ ॥

Śrīmad Bāgavata - Canto 12, Chapter 12
Yaśaḥ śriyāmeva pariśramaḥ paro varṇāśramācāratapaḥ śrutādiṣu,
Avismr‌tiḥ Śrīdharapādapadmayorguṇānuvādaśravaṇādarādibhiḥ. 54.

*The great endeavor one undergoes in executing the ordinary social and religious duties of the varn‌āśrama system, in performing austerities, and in hearing from the Vedas culminates only in the achievement of mundane fame and opulence. But by respecting and attentively hearing the recitation of the transcendental qualities of the Supreme Lord, the husband of the goddess of fortune, one can remember His lotus feet.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 289 / DAILY WISDOM - 289 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 15. దేవుని నుండి బహుశా ఎటువంటి స్పందన లేదు🌻*

*భగవంతుడు విశ్వానికి అవతల ఉన్నాడు మరియు మనకు వెలుపల ఉన్నాడు, చేరుకోలేడు, మరియు ప్రార్థనలో మనం ప్రయత్నించి నప్పటికీ, అతని నుండి ఎటువంటి ప్రతిస్పందనను పొందలేము అనే ఈ ఆలోచనలన్నీ మనస్సులోని కొన్ని నిక్షిప్తాల కారణంగా ఉన్నాయి. , మనస్సును కప్పి ఉంచే తామసిక గుణాలు దానిని మళ్లీ సూక్ష్మంగా ఇంద్రియ వస్తువుల వైపు మొగ్గు చూపేలా చేస్తాయి. ఇంద్రియ వస్తువుల కోసం కోరిక, ఉపచేతన స్థాయిలో చాలా గుప్త రూపంలో సూక్ష్మంగా ఉంటుంది. బహుశా భగవంతుని నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదని మనస్సులో సందేహానికి ఇదే కారణం అవుతుంది.*

*ఎందుకంటే మన ప్రేమ భగవంతుని పట్ల కాదు-అది ఇంద్రియ వస్తువులు మరియు సమాజంలో హోదా మరియు ప్రపంచంలోని వివిధ రకాల ఆనందాల కోసం. తపస్సు లేదా యమనియమాల ద్వారా, మనం మన ఇంద్రియాలను అణచి వేసినప్పుడు, వాటి కార్యకలాపాలకు తాత్కాలిక విరమణ ఉంటుంది. కానీ తన మంత్రివర్గం నుండి త్రోసి వేయబడిన వ్యక్తి మరోసారి మంత్రిగా ఉండాలనే కోరికను కోల్పోకుండా ఉండలేనట్లే, విషయాల పట్ల ఉపచేతన కోరిక ఆగిపోదు; వీలైతే మరో సారి ఎన్నికల బరిలో నిలుస్తాడు. సూక్ష్మమైన ఉపచేతన కోరిక అలాగే ఉంది కనుక స్థానాభిమానం పారద్రోలినా కూడా మనస్సులో శాంతి లేకుండా అశాంతిగా ఉంటాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 289 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 15. Perhaps there is No Response from God🌻*

*The idea that God is extra-cosmic and outside us, incapable of approach, and that we are likely not to receive any response from Him in spite of our efforts at prayer, etc.—all these ideas are due to certain encrustations in the mind, the tamasic qualities which cover the mind and make it again subtly tend towards objects of sense. The desire for objects of sense, subtly present in a very latent form in the subconscious level, becomes responsible for the doubt in the mind that perhaps there is no response from God.*

*This is because our love is not for God—it is for objects of sense, and for status in society and enjoyments of various types in the world. And when, through austerity, or tapas, we have put the senses down with the force of our thumb, there is a temporary cessation of their activity. But the subconscious desire for things does not cease, just as a person who is thrown out of his ministry may not cease from desiring to be a minister once again; he will stand for election another time, if possible. The subtle subconscious desire is there. He will be restless, without any peace in the mind, because the position has been uprooted.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 189 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు. హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచి పోయాం. 🍀*

*ప్రతి మనిషి ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఫీలవుతాడు. తను ఎక్కడి నించో వచ్చేసినట్లు భావిస్తాడు. అది అతనికి స్పష్టం కాదు. కానీ ప్రతి మనిషి అట్లా భావిస్తాడు. అస్పష్టంగా వూహిస్తాడు. నేను సరైన స్థలంలో లేను. నేను సరయిన పరిస్థితిలో లేను. యిక్కడ వుండాల్సింది కాదు. 'ఏదో పొరపాటు జరిగింది' అనుకుంటాడు. వ్యక్తి ఏ క్షణంలో జ్ఞానం పొందడం ఆరంభిస్తాడో అతను హృదయంతో సంబంధాన్ని కోల్పోతాడు.*

*హృదయం నిజమైన బృందావనం. అది మనలో వుంది. మనతో తీసుకుపోతూ వుంటాం. మనం దాన్ని మరిచిపోయాం. దాన్ని నిర్లక్ష్యం చేశాం. మనం తలకు అతుక్కుపోయాం. మనం మరీ ఎక్కువగా జ్ఞానానికి అతుక్కుపోయాం. అస్తిత్వంలో ఎదగడం బదులు, అస్తితవ్వంతో పుష్పించడం బదులు, మనం కేవలం సమాచారాన్ని పోగు చేసుకుంటున్నాం. పనికి మాలిన సమాచార సేకరణలో వున్నాం. హృదయం స్వర్గం. నా ప్రయత్నమంతా మీరు స్వర్గంలో అడుగుపెట్టడానికి సాయపడడం. ఒకసారి మీరు దానిలో అడుగుపెడితే, అనుభవం పొందితే మీరు రూపాంతరం చెందుతారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 99. సమయస్ఫూర్తి - 1🌻*

*కార్యములకు శుభలగ్నములు, తేదీలు నిర్ణయించు కొనుట వానిని సకాలమున పూర్తి గావించు కొనుట ఒక క్రమశిక్షణ. దైనందిన జీవితమున నిదురలేచుటకు, స్నానాదికములను గావించు కొనుటకు, దైవప్రార్థనలు నిర్వర్తించుకొనుటకు, దైనందిన కార్యముల కొరకు ఆహార విహారముల కొరకు కాలనిర్ణయము జరుగవలెను. కాలమును నిర్ణయించి పాటించిన వారికి సంకల్పబలము పెరుగును. బలము సంకల్పసిద్ధిని కూడ నిచ్చును.*

*కాలము విషయమున అశ్రద్ధ పనికి రాదు. అలసత్వముండ రాదు. నిర్ణీత సమయమునకు కార్యములు నిర్వర్తించువారు సమర్థులు కాగలరు. సర్వసమర్థతకు సమయ పాలనమే ముఖ్యము. సూర్యచంద్రులు, గ్రహగోళాదులు కాలమునే దైవముగ భావించి ప్రవర్తింతురు. అట్లే సమస్త దేవతలును. కాలమును వ్యర్థము చేయువారు, నిజమగు వ్యర్థులు. వారు ఊబినేలపై నడుచునటు వంటివారు. ఇట్టి వారియందు అశ్రద్ధ, సోమరితనము తెలియకయే పెరిగి, తామున్న స్థితి నుండి కూడ దిగజారుట జరుగును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment