శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 376 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 376 -1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀
🌻 376-1. 'శృంగార రస సంపూర్ణా' 🌻
శృంగార మనెడు రసముచే లెస్సగా నిండినది శ్రీమాత అని అర్ధము. 'శృంగ' అనగా రెండు అని అర్థము. 'అర' అనగా దళము అని అర్థము. 'రస’ అను పదమునకు ఆరు అని అర్థము. ఇట్లు గ్రహించినచో ఆరు జతల దళముల పేర్పు అని తెలియవచ్చును. అనగా పండ్రెండు దళముల పద్మము. అదియే హృదయ పద్మము. అనాహత పద్మమని కూడ అందురు. హృదయము వ్యక్త, అవ్యక్తముల యొక్క కూటమి. అచట అనాహతము, ఆహతము కలియును. సూక్ష్మము, స్థూలము కలియును. ప్రకృతి, పురుషుడు కలియును. నిత్యము, అనిత్యము కలియును.
అన్ని లోకములు ప్రకృతి పురుషుల కలయికచే యేర్పడు చున్ననూ హృదయ పద్మము యొక్క ప్రత్యేకత యేమనగా అచ్చట యిరువురును సమపాళ్ళుగ నుందురు. అందువలన ఆనందము సమ్యక్ పూర్ణమై నిలచును. ప్రకృతి, పురుషుడు అను శృంగములు రెండునూ సమమై వర్తించినపుడు పొందదగిన ఆనందము యితర స్థితులలో వీలుపడదు. సంపూర్ణమగు ఆనందమును ప్రేమ అందురు. అట్టి ప్రేమ యందు ఆధిక్యత, న్యూనత లేవు. సమత్వమే గోచరించును. లక్ష్మీనారాయణు లని, భవానీ శంకరు లని, వాణీ హిరణ్యగర్భు లని, శచీ పురందరు లని, అరుంధతీ వశిష్ఠు లని, సీతారాము లని కొనియాడబడు ఈ ఆరు జంటలు ఈ నామమునకు ఉదాహరణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 376-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻
🌻 376-1. Śṛṅgāra-rasa- saṁpūrṇā शृङ्गार-रस-संपूर्णा 🌻
She is in the form of essence of love. Previous nāma discussed about four pīṭha-s and in particular the previous nāma referred to kāmagiri pīṭha or mūlādhāra cakra. In this nāma a reference is being made to the pūrṇagiri pīṭha or the navel cakra. The previous nāma made a reference to kāmagiri pīṭha.
Parā vāc that originated from the mūlādhāra cakra or kāmagiri pīṭha, enters the next phase of evolution at the navel cakra or this pūrṇagiri pīṭha. The dot which was known as kāraṇa bindu at the navel cakra-s becomes kārya bindu in this cakra. Details of these bindu-s have been been discussed in nāma 366.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
02 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment