నిర్మల ధ్యానాలు - ఓషో - 199

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 199 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి తనకు ఏమీ తెలియదన్న సగంతి తెలుసుకోవాలి. సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. నీకు తెలుసుననే అభిప్రాయం నీకు ఏర్పడితే అప్పుడు అన్వేషణ ఆగిపోతుంది. ఇదే జ్ఞానంలో వున్న గొప్ప ప్రమాదం. 🍀


జ్ఞానంలో వున్న గొప్ప ప్రమాదం ఏమిటంటే అది నీకు దురభిప్రాయాల్ని ఏర్పరుస్తుంది. నీకు తెలుసుననే అభిప్రాయం నీకు ఏర్పడితే అప్పుడు అన్వేషణ ఆగిపోతుంది. వ్యక్తి తనకు ఏమీ తెలియదన్న సగంతి తెలుసుకోవాలి. సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. అన్ని మతాల నించీ సంపాందించిన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి.

అప్పుడు అన్వేషణ ఆరంభమవుతుంది. అప్పుడు వ్యక్తి నిజమైన అన్వేషకుడవుతాడు. తెలియనితనం వున్నపుడు ఒకరోజు గొప్ప దీవెన అందుతుంది. సత్యం ఆవిష్కారం అవుతుంది. దాన్నే జ్ఞానోదయమంటారు. నిర్వాణమంటారు. ప్రాచ్యంలో దాన్ని బుద్ధుని లేదా కృష్ణ చైతన్యమంటారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


23 Jun 2022

No comments:

Post a Comment