శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 2🌻
శ్రీమాత పరతత్వమున కర్పితయై పరమానంద భరితయై యుండును. జీవులు శ్రీమాత అనుగ్రహమును పొందుటకు గాని, దైవ సాన్నిధ్యము చేరుటకు గాని, దైవానుగ్రహము పొందుటకు గాని, దైవమే తాముగ వైభవోపేతమైన జీవితమును జీవించుటకు గాని, సర్వోత్తమమైన మార్గము సమర్పణ మార్గము. ఈ మార్గ మత్యంత సాహసముతో కూడినది. దైవము నందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవారు మాత్రమే నిర్వర్తింపగలరు.
అట్టి విశ్వాసము కూర్చువాడు కూడ దైవమే. కలియుగమున అనేకులు ఇట్టి సమర్పణ మార్గము ననుసరించి అనుగ్రహము పొంది, భూమిపై దైవమే తానుగ శాశ్వతముగ నిలచి జీవుల నుద్ధరించు చున్నారు. ఇట్టి మహాత్ములు ఎందరో హిమాలయములను కేంద్రముగ నేర్పరచుకొని జీవుల వృద్ధిని గూర్చి, సంవృద్ధిని గూర్చి కృషి సల్పుచున్నారు. మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు, సూర్య వంశపు క్షత్రియుడగు మరువు, చంద్ర వంశపు క్షత్రియుడగు దేవాపి మొదలుగ ఎందరో మహాత్ములు ఈ సమర్పణ మార్గమున దైవప్రతినిధులై భూమిపై దివ్యదేహములు దాల్చి చరించు చున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻
🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -2 🌻
Second is the mantra itself that infuses life to the visualized form. This situation is applicable only in the initial stages and as one progresses, further guidance is received from the concerned deity itself by way of communion. This nāma says that such mantra-s should be recited only mentally.
There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment