శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587


🌹 . శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴

🌻. కుమారస్వామి జననము - 7 🌻


ఓ కుమారా! ఆ ఆర్గురు ఋషిపత్నులు తమకు పాతిపత్య లోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోమయ్యెను (63). ఆ మునిపత్నులు గర్భరూపమున నున్న శివతేజస్సును హిమవత్పర్వతముపై విడిచి పెట్టి తాపశాంతిని పొందిరి (64). హిమవంతుడా శివతేజస్సును సహింప జాలక వణకి పోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింప శక్యముకాని ఆ శివతేజస్సును వెంటనే గంగలో పడవైచెను (65). ఓ మహర్షీ! గంగ కూడ సహింప శక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను(66).

అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు,శోభాయుక్తుడు, తేజశ్శాలి, ప్రీతిని వర్ధిల్ల జేయువాడు అగు బాలకునిగా మారిపోయెను(67). ఓ మహార్షీ! మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠినాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను (68). అదే సమయములో కైలాసము నందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి (69). పార్వతి స్తవముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షీ! అచటకు వెళ్లిన వారందరికీ ఆనందము కలిగెను(70).

కుమారా!ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళ మయములాయెను.దుష్టులకు, విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను (71).అకస్మాత్తుగా ఆకాశమునందుగొప్ప దుందుభిధ్వని బయల్వెడలెను. ఓ నారదా! ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి గురిసెను (72). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరకీ అకస్మాత్తుగా పరమానందము, పరమోత్సాహము కలిగెను (73).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివపుత్ర జననమనే రెండవ అధ్యాయము ముగిసినది(2).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 587 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴

🌻 The birth of Śiva’s son - 7 🌻

63. O dear, on seeing their own state the six ladies felt very miserable and distressed.

64. The wives of the sages cast off their semen in the form of a foetus at the top of Himavat. They felt then relieved of their burning sensation.

65. Unable to bear that semen of Śiva and trembling much, Himavat became scorched by it and hurled it in the Gaṅgā.

66. O great sage, the intolerable semen of lord Śiva was deposited by Gaṅgā in the forest of Śara grass by means of its waves.

67. The semen that fell was turned in a handsome good-featured boy, full of glory and splendour. He increased everyone’s pleasure.

68. O great sage, on the sixth day of the bright half of the lunar month of Mārgaśīrṣa, the son of Śiva was born in the world.

69. At that time, O Brahmin, on their mountain, Pārvatī the daughter of Himavat and Śiva became very happy.

70. Out of joy, milk exuded from the breasts of Pārvatī. On reaching the spot everyone felt very happy.

71. O dear, there was auspiciousness in the three worlds, pleasing to the good. There occurred obstacles to the wicked and particularly to the demons.

72. O Nārada, there was a mysterious sound of Dundubhi drum in the sky. Showers of flowers fell on the boy.

73. O excellent sage, there was great delight to Viṣṇu and the gods. There was great jubilation everywhere.


Continues....

🌹🌹🌹🌹🌹


30 Jun 2022

No comments:

Post a Comment