🍀 27 - JULY - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹 27 - JULY - 2022 WEDNESDAY  ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 27, జూలై 2022 బుధవారం, సౌమ్య వాసరే  Wednesday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 238 / Bhagavad-Gita - 238 -6-05 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 637 / Vishnu Sahasranama Contemplation - 637 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 316 / DAILY WISDOM - 316 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 216 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹27 July 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు :  లేవు  🌺*

*🍀. నారాయణ కవచము - 13 🍀*

*21. దేవోఽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్ |*
*దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోఽవతు పద్మనాభః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి :   మానవులలోని భగవంతుని ప్రేమించే అత్మ యొక్క ధర్మం అనేకులతో ప్రేమానుబంధం పెట్టుకొని అంతు లేని ఆనందంలో నోలలాడడమే. అయితే, ఆ అందరిలోనూ అది ప్రేమించునది మాత్రం ఒకే పరమాత్మను మాత్రమే. ఇదీ రహస్యం.  🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 21:13:11 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: పునర్వసు 31:04:59 వరకు
తదుపరి పుష్యమి
యోగం: హర్షణ 17:06:53 వరకు
తదుపరి వజ్ర
కరణం: విష్టి 08:00:46 వరకు
వర్జ్యం: 17:37:30 - 19:25:10
దుర్ముహూర్తం: 11:56:35 - 12:48:26
రాహు కాలం: 12:22:31 - 13:59:42
గుళిక కాలం: 10:45:19 - 12:22:31
యమ గండం: 07:30:56 - 09:08:07
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 28:23:30 - 30:11:10
మరియు 26:39:48 - 28:26:36
సూర్యోదయం: 05:53:44
సూర్యాస్తమయం: 18:51:17
చంద్రోదయం: 04:25:44
చంద్రాస్తమయం: 18:04:24
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: జెమిని
గద యోగం - కార్య హాని , చెడు 31:04:59
వరకు తదుపరి మతంగ యోగం -
అశ్వ లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 238 / Bhagavad-Gita -  238 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 05 🌴*

*05. ఉద్ధరేదాత్మనాత్మనం నాత్మానమవసాదయేత్ |*
*ఆత్మైవ హ్యాత్మనో బన్దురాత్మైవ రిపురాత్మన:*

🌷. తాత్పర్యం :
*ప్రతి యొక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్దరించుకొన వలెనే గాని అధోగతిపాలు చేసికొన రాదు. బద్ధజీవునికి మనస్సనునది మిత్రుడును, అలాగుననే శత్రువును అయియున్నది.*

🌷. భాష్యము :
పరిస్థితుల ననుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును, ఆత్మను సూచించును. యోగపద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి యను అంశములు అత్యంత ముఖ్యములైన విషయములు. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్రవిషయమైనందున ఇచ్చట ఆత్మ యనగా మనస్సని భావము. అట్టి మనస్సును నియమించి, దానిని ఇంద్రియార్థముల నుండి వేరుచేయుటయే యోగము యొక్క ముఖ్యప్రయోజనమై యున్నది. బద్ధజీవునికి అజ్ఞానమనెడి బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సుకు శిక్షణ నొసగవలెనని ఇచ్చట నొక్కి చెప్పబడినది.

వాస్తవమునకు భౌతికస్థితి యందు ప్రతియొక్కరు మనోఇంద్రియముల ప్రభావమునకు గురియై యుందురు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్యాహంకారముతో మనస్సు లగ్నమై యున్నందునే భౌతికజగము నందు శుద్దాత్మ భవబంధములో తగుల్కొనును. కనుక భౌతికప్రకృతి యొక్క పై పై మెరుగులకు ఆకర్షితము కానట్లుగా మనస్సును మలచవలెను. ఆ విధముగా బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల యెడ ఆకర్షణతో ఎవ్వరును తమను తాము అధోగతిపాలు చేసికొనరాదు. ఇంద్రియార్థముల యెడ మనుజుడు ఎంతగా ఆకర్షణను కలిగియుండునో అంతగా అతడు భవబంధములో చిక్కుకొనును.

అట్టి భవబంధము నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణభక్తిభావన యందు నిలిపుటయే అత్యంత ఉత్తమమార్గము. ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు “హి” అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతియొక్కరు దీనిని ఆచరింపవలసియున్నది. అమృతబిందూపనిషత్తు (2) ఈ విషయమున ఇట్లు పలుకుచున్నది.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో: |
బంధాయ విషయాసంగో ముక్వై నిర్విషయం మన:

“మనుజునకు మనస్సే బంధకారణము మరియు ముక్తికారణము అయియున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధకారణము కాగా, ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది”. అనగా కృష్ణభక్తిభావన యందు సంలగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 238 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

🌴 Chapter 6 - Dhyana Yoga - 05  🌴

*05. uddhared ātmanātmānaṁ nātmānam avasādayet*
*ātmaiva hy ātmano bandhur ātmaiva ripur ātmanaḥ*

🌷 Translation :
*One must deliver himself with the help of his mind, and not degrade himself. The mind is the friend of the conditioned soul, and his enemy as well.*

🌹 Purport :
The word ātmā denotes body, mind and soul – depending upon different circumstances. In the yoga system, the mind and the conditioned soul are especially important. Since the mind is the central point of yoga practice, ātmā refers here to the mind. The purpose of the yoga system is to control the mind and to draw it away from attachment to sense objects. It is stressed herein that the mind must be so trained that it can deliver the conditioned soul from the mire of nescience.

In material existence one is subjected to the influence of the mind and the senses. In fact, the pure soul is entangled in the material world because the mind is involved with the false ego, which desires to lord it over material nature. Therefore, the mind should be trained so that it will not be attracted by the glitter of material nature, and in this way the conditioned soul may be saved. One should not degrade oneself by attraction to sense objects. The more one is attracted by sense objects, the more one becomes entangled in material existence. The best way to disentangle oneself is to always engage the mind in Kṛṣṇa consciousness. The word hi is used for emphasizing this point, i.e., that one must do this. It is also said:

mana eva manuṣyāṇāṁ kāraṇaṁ bandha-mokṣayoḥ
bandhāya viṣayāsaṅgo muktyai nirviṣayaṁ manaḥ

“For man, mind is the cause of bondage and mind is the cause of liberation. Mind absorbed in sense objects is the cause of bondage, and mind detached from the sense objects is the cause of liberation.” (Amṛta-bindu Upaniṣad 2) Therefore, the mind which is always engaged in Kṛṣṇa consciousness is the cause of supreme liberation.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 637/ Vishnu  Sahasranama Contemplation - 637🌹*

*🌻637. విశోధనః, विशोधनः, Viśodhanaḥ🌻*

*ఓం విశోధనాయ నమః | ॐ विशोधनाय नमः | OM Viśodhanāya namaḥ*

విశోధనః, विशोधनः, Viśodhanaḥ

*స్మృతిమాత్రేణ పాపానాం (శోధనాత్‍) క్షపణాత్ స విశోధనః*

*తన స్మరణ మాత్రము చేతనే పాపములను నశింప జేసి పాపులను విశుద్ధులనుగా చేయువాడు విశోధనః*

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ.బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములుగురుతల్ప కల్మష క్రూర సర్పములకుఁ గేకులు హరినామ కీర్తనములుతపనీయ చౌర్య సంతమసంబుకను సూర్య కిరణముల్ హరినామ కీర్తనములుమధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ గేసరుల్ హరినామ కీర్తనములుగీ.మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల, నలరు బ్రహ్మాది సురులకు నందరానిభూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య, ఖేలనంబులు హరినామ కీర్తనములు. (118)

భగవంతుని నామసంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాములు అనే అడవులకు అగ్నిజ్వాలలు. హరినామ కీర్తనలు గురుద్రోహమనే ఘోర సర్పాలకు నెమళ్ళు. భగవన్నామ కీర్తనలు బంగారమును దోంగిలించడమనే మహా పాపరూపమైన చీకట్లను పోగొట్టే సూర్యకిరణములు.  హరినామ కీర్తనములు మధుపాన మహాపాపమనే మదపుటేనుగులను సంహరించే సింహాలు. మహిమతోగూడిన యోగసమాధి విధులతో ఒప్పే బ్రహ్మ మొదలగు దేవతలకు సైతము అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసములు హరినామ కీర్తనములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 637🌹*

*🌻637.Viśodhanaḥ🌻*

*OM Viśodhanāya namaḥ*

स्मृतिमात्रेण पापानां (शोधनात्‍) क्षपणात् स विशोधनः /
*Smr‌timātreṇa pāpānāṃ (śodhanātˈ) kṣapaṇāt sa Viśodhanaḥ*

*Since by mere remembrance He erases the sins, he purifies the sinners and hence He is Viśodhanaḥ.*

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे द्वितीयोऽध्यायः ::
अयम् हि कृतनिर्वेशो जन्मकोट्यंहसामपि ।
यद्व्याजहार विवशो नाम स्वस्त्ययनं हरेः ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 2
Ayam hi kr‌tanirveśo janmakoṭyaṃhasāmapi,
Yadvyājahāra vivaśo nāma svastyayanaṃ hareḥ. 7.

(Ajāmiḷa) has already atoned for all his sinful actions. Indeed, he has atoned not only for sins performed in one life but for those performed in millions of lives, for in a helpless condition he chanted the holy name of Nārāyaṇa. Even though he did not chant purely, he chanted without offense, and therefore he is now pure and eligible for liberation.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥
అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 316 / DAILY WISDOM - 316 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద  📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 11. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు🌻*

*నిమ్న జగత్తులు, ఉన్నత జగత్తులుగా పరిణామం చెందాలనే ఉద్దేశ్యంతో విశ్వమంతా నిత్యం పనిచేస్తోంది. వాస్తవానికి, విశ్వంలో ఒకే ఒక చర్య జరుగుతోంది. అందుకే దేవుడు అన్నీ చేస్తున్నాడని కొందరు అంటారు. దాని వెనుక ఉన్న ఆలోచన భౌతిక శరీరం చేసే చర్య లాంటిది. ఉదాహరణకు, మీరు చేయి పైకెత్తినా, కాళ్లతో నడిచినా, కళ్లతో చూసినా, నోటితో తిన్నా, కడుపుతో జీర్ణం చేసినా - ఈ చర్యలలో వైవిధ్యం ఏదైతేనేం, అది మొత్తం శరీరం చేసే ఒక చర్య అని మీరు అంగీకరిస్తారు.*

*అదే విధంగా, విశ్వం, ఒక పెద్ద జీవి అనుకుందాం.  కొన్నిసార్లు మతపరమైన భాషలో దానిని దేవుని శరీరం అని పిలుస్తారు. ఒకదానికొకటి భిన్నంగా ఉండే ఈ వైవిధ్యాలన్నీ భగవంతుని సంకల్పం లేదా విశ్వ కేంద్రం నుండి వెలువడే శక్తి యొక్క చర్యలు. విశ్వంలో అనేక చర్యలు జరగడం లేదు; ఎవరు చేస్తున్నట్లు కనిపించినా ఒక్క చర్య మాత్రమే జరుగుతోంది. సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్క భాగం అది చేస్తున్నట్లు ఊహించు కుంటుంది. కాళ్ళు కళ్లతో ఏకీభవించనట్టుగా ఉంది. కాళ్ళు నడవడానికి కావాల్సిన సహకారం కళ్ళు అందించినా ఆ సహాయాన్ని కాళ్ళు గుర్తించనట్టుగా ఉంటుంది. అన్ని అవయవాలు స్వతంత్రంగా పని చేస్తున్నట్టు భావిస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 316 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 11. God is Doing Everything🌻*

*The whole universe is acting perpetually for the purpose of the evolution of the lower categories into the higher ones. Actually, there is only one action taking place in the universe. This is why some people say that God is doing everything. The idea behind it is something like the action that the physical body does. For example, whether you lift your hand, walk with your feet, see with your eyes, eat with your mouth, digest with your stomach—whatever be the diversity of these actions, you will agree that it is one action being done by the whole body.*

*In a similar manner, the universe, being a large organism, sometimes called in religion the body of God, all these diversities of action which differ one from the other are actions of the central force which is the will of God or the Centre of the cosmos. There are not many actions taking place in the universe; only one action is taking place, regardless of who is appearing to do it. The problem is that each individual part imagines that it is doing it. It is something like the legs not agreeing with the eyes. You can imagine that they can assert and not give any credit for the cooperation received from the other limbs. Each one could say that it is independent.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 216 🌹*
*✍️.  సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీ లోపలి చెత్తా చెదారాన్ని బయటికి విసిరికొట్టు. అక్కడ విశాలస్థలాన్ని ఏర్పరచు. అప్పుడు ఆ స్థలం నీ అస్తిత్వంతో పొంగిపొర్లుతుంది. అస్తిత్వం ఎదగడానికి స్థలం కావాలి. అస్తిత్వం తన రేకుల్ని విచ్చుకుంటుంది.🍀*

*ఔన్నత్యమన్నది సహజంగా సంభవించేది.  దేవుని రాజ్యాన్ని  అందుకోవడమన్న మన లక్ష్యం కాదు. దాన్ని మరిచిపో. నా బోధనల సారాంశం నువ్వు ఏమీ కానివాడిగా, లేనివాడివిగా మారు. నీ లోపలి చెత్తా చెదారాన్ని బయటికి విసిరికొట్టు. అక్కడ విశాలస్థలాన్ని ఏర్పరచు. అప్పుడు ఆ స్థలం నీ అస్తిత్వంతో పొంగిపొర్లుతుంది.*

*అస్తిత్వం ఎదగడానికి స్థలం కావాలి. అస్తిత్వం తన రేకుల్ని విచ్చుకుంటుంది. అది వేల పత్రాల పద్మమవుతుంది. నీలోంచీ గొప్ప సంగీతం, కవిత్వం, నాట్యం, దయ మొదలవుతాయి. అటంకం లేకపోవడం వల్ల అనంత స్వేచ్చ విస్తరిస్తుంది. నువ్వు విశాలమవుతావు. జీవితం విస్ఫోటించి కాంతి, ప్రేమ ఆనందం కళకళలాడుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

No comments:

Post a Comment