నిత్య ప్రజ్ఞా సందేశములు - 316 - 11. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు / DAILY WISDOM - 316 - 11. God is Doing Everything
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 316 / DAILY WISDOM - 316 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 11. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు🌻
నిమ్న జగత్తులు, ఉన్నత జగత్తులుగా పరిణామం చెందాలనే ఉద్దేశ్యంతో విశ్వమంతా నిత్యం పనిచేస్తోంది. వాస్తవానికి, విశ్వంలో ఒకే ఒక చర్య జరుగుతోంది. అందుకే దేవుడు అన్నీ చేస్తున్నాడని కొందరు అంటారు. దాని వెనుక ఉన్న ఆలోచన భౌతిక శరీరం చేసే చర్య లాంటిది. ఉదాహరణకు, మీరు చేయి పైకెత్తినా, కాళ్లతో నడిచినా, కళ్లతో చూసినా, నోటితో తిన్నా, కడుపుతో జీర్ణం చేసినా - ఈ చర్యలలో వైవిధ్యం ఏదైతేనేం, అది మొత్తం శరీరం చేసే ఒక చర్య అని మీరు అంగీకరిస్తారు.
అదే విధంగా, విశ్వం, ఒక పెద్ద జీవి అనుకుందాం. కొన్నిసార్లు మతపరమైన భాషలో దానిని దేవుని శరీరం అని పిలుస్తారు. ఒకదానికొకటి భిన్నంగా ఉండే ఈ వైవిధ్యాలన్నీ భగవంతుని సంకల్పం లేదా విశ్వ కేంద్రం నుండి వెలువడే శక్తి యొక్క చర్యలు. విశ్వంలో అనేక చర్యలు జరగడం లేదు; ఎవరు చేస్తున్నట్లు కనిపించినా ఒక్క చర్య మాత్రమే జరుగుతోంది. సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్క భాగం అది చేస్తున్నట్లు ఊహించు కుంటుంది. కాళ్ళు కళ్లతో ఏకీభవించనట్టుగా ఉంది. కాళ్ళు నడవడానికి కావాల్సిన సహకారం కళ్ళు అందించినా ఆ సహాయాన్ని కాళ్ళు గుర్తించనట్టుగా ఉంటుంది. అన్ని అవయవాలు స్వతంత్రంగా పని చేస్తున్నట్టు భావిస్తాయి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 316 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 11. God is Doing Everything🌻
The whole universe is acting perpetually for the purpose of the evolution of the lower categories into the higher ones. Actually, there is only one action taking place in the universe. This is why some people say that God is doing everything. The idea behind it is something like the action that the physical body does. For example, whether you lift your hand, walk with your feet, see with your eyes, eat with your mouth, digest with your stomach—whatever be the diversity of these actions, you will agree that it is one action being done by the whole body.
In a similar manner, the universe, being a large organism, sometimes called in religion the body of God, all these diversities of action which differ one from the other are actions of the central force which is the will of God or the Centre of the cosmos. There are not many actions taking place in the universe; only one action is taking place, regardless of who is appearing to do it. The problem is that each individual part imagines that it is doing it. It is something like the legs not agreeing with the eyes. You can imagine that they can assert and not give any credit for the cooperation received from the other limbs. Each one could say that it is independent.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment