శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 3🌻


ఇటీవలి కాలమున రహస్తర్పణ తర్పిత మార్గమును అవలంబించిన వారిలో శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవింద మహర్షి, షిరిడీ సాయిబాబా, మాస్టర్ సి.వి.వి., శ్రీ సత్యసాయి మాస్టర్ ఇ.కె. ముఖ్యులు. బాబా, జీవులు దైవమునకు తమను తాము సమర్పించుకొనుటలో చాల వ్యత్యాస ముండును. బహుకొద్దిగ తమను తాము సమర్పణ చేయువారుందరు. తమకున్నవి సమర్పణ చేయుట నుండి తమను తాము సమర్పణ చేసుకొనుట వరకు మార్గ మున్నది.

తమకున్న దానిలో కొద్దో గొప్పో ఇతరుల శ్రేయస్సు కొరకై సమర్పణ చేయుట చాలమంది చేయుదురు. తమకున్న దానిని అంతయూ సమర్పణ చేయువారు హరిశ్చంద్రాదుల వంటివారు. తమనే సమర్పణ చేసుకొనువారు అరుదు. ప్రహ్లాదుడు, నారదుడు, అంబరీషుడు, శిబి, బలి, తమను తాము అర్పణము చేసుకొన్న మహాత్ములు. అట్టివారు శాశ్వతులై భాగవత దేహములతో జీవులకు స్ఫూర్తి నిచ్చుచున్నారు. అట్టి వారందరికిని శ్రీమాతయే మార్గదర్శి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻

🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -3 🌻

There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive). The oblations consist of the thirty six tattva-s or the principles that are responsible for our karma-s, either good or bad.

In Śrī vidyā navāvaraṇa pūjā there is one separate ritual called ‘internal oblation’ or tatvaśodhana wherein all the dualities are sacrificed as oblations in the internal fire.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jul 2022

No comments:

Post a Comment